Radhe Shyam Movie Making Video: మరో వారం రోజుల్లో రాధేశ్యామ్ రానుండగా చిత్ర బృందం ప్రచారాలతో హోరెత్తిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సూపర్ అనిపించుకోగా, ఇక ఈ చిత్రానికి రాజమౌళి కూడా జత కలిశారు. ముఖ్య ఘట్టాలకు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఏది ఏమైనా 70ల కాలంనాటి స్టోరీ, రూ. వందల కోట్ల బడ్జెట్, దర్శకుడు రాధాకృష్ణ కుమార్ డ్రీమ్ ప్రాజెక్ట్, చాలాకాలం తర్వాత ప్రభాస్ ఎంపిక చేసుకున్న లవ్ సబ్జెక్ట్.. ‘రాధేశ్యామ్’ చిత్రమనగానే ప్రేక్షకులకు టక్కున గుర్తొచ్చే విశేషాలివి.

తన కలల చిత్రాన్ని తెరకెక్కించేందుకు దర్శకుడు, ఆయన బృందం ఎంతో కష్టపడింది. అయితే ఇది తెలియజేస్తూ తాజాగా ఈ చిత్ర ‘మేకింగ్ వీడియో’ ను చిత్రబృందం విడుదల చేసింది. మరో విషయం ఏంటంటే, తన బీజీఎంతోనే 50% విజయాన్ని అందించే తమన్, క్లైమాక్స్‌లో అదిరిపోయే బీజీఎం ఇచ్చాడట.
కాగా రాధేశ్యామ్‌లో వరల్డ్‌లోనే ఫేమస్ పామిస్ట్‌గా ప్రభాస్ కనిపించనున్న విషయం తెలిసిందే. చిత్ర బృందాల సమాచారం మేరకు, లండన్ ఫేమస్ పామిస్ట్ విలియమ్ జాన్ వార్నర్ జీవిత కథ ఆధారంగా రాధేశ్యామ్‌ని మలచినట్టు తెలుస్తోంది. అతడు భారత్‌లో జాతకం చెప్పడం నేర్చుకొని, లండన్‌లో ఫేమస్ అయ్యాడు. రాధేశ్యామ్ కథ అధిక భాగం 1970ల్లో జరుగుతుండగా, చివరి అరగంట చాలా ఆసక్తిగా సాగుతుందని సమాచారం.

ఇక ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే పాటలు బాగా ఆకట్టుకోగా, యువన్ శంకర్ రాజా పాడిన ఈ రాతలే అనే పాట సూపర్ హిట్ అయింది. మొత్తమ్మీద ‘రాధే శ్యామ్’ సినిమాలో ప్రభాస్ – పూజ హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. ప్రభాస్ లుక్స్ చాలా కొత్తగా ఉన్నాయి. పూజా కూడా చాలా అందంగా కనిపించింది.