Radhe Shyam- Bheemla Nayak Box Office Collection: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘రాధేశ్యామ్’ సినిమా ఇప్పటికే తొలి రోజు 79 కోట్లు వసూలు చేసింది. అయితే నైజాంలో మటుకు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్‌ని బీట్ చేయలేకపోయింది. భీమ్లా నాయక్ సినిమా నైజాంలో తొలి రోజు 11.8 కోట్లు వసూలు చేస్తే రాధేశ్యామ్ 11 కోట్లతోనే సరిపెట్టుకుంది. దీంతో నైజాం నవాబ్ పవర్ స్టార్ పవనే అని అభిమానులు అంటున్నారు.
మరోవైపు రాధేశ్యామ్ ప్యూర్ లవ్‌స్టోరీ కావడంతో ఈ ఏడాది చివరిలో వచ్చే సలార్‌తో చూసుకుందాం అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. కాగా ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ సినిమాలకు ప్రీరిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతుంది. పైగా పాన్ ఇండియా స్టార్ అయ్యాక ప్రభాస్ సినిమా కోసం.. యావత్ భారతీయ సినీ అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ ఆతృత నడుమ భారీ స్థాయిలో రిలీజ్ అయిన ‘రాధే శ్యామ్’ కోసం బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు ఎగబడ్డారు.
Also Read: ‘ఆడవాళ్లు..’ దెబ్బకు 8 కోట్లు పోగొట్టుకున్న నిర్మాత
ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాకు బిజినెస్ జరిగింది. కానీ చివరకు ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ మాత్రం రావడం లేదు. పైగా ప్రభాస్ తన కెరీర్లోనే తొలిసారిగా ఒక్కఫైట్ కూడా లేకుండా చేసిన సినిమానే ‘రాధేశ్యామ్’. ప్యూర్ లవ్స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను బాగా నిరాశ పరిచింది. ఓ అభిమాని అయితే.. సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది అని భరించలేక ఆత్మహత్య కూడా చేసుకున్నాడు.
మొత్తమ్మీద డార్లింగ్ ప్రభాస్ అటు ప్రేక్షకులతో పాటు ఇటు మాస్ ఆడియెన్స్ను కూడా మెప్పించలేకపోయాడు. రాధేశ్యామ్ కోసం సుమారు 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అలాగే టాల్ బ్యూటీ పూజా హెగ్డేకి 4 కోట్లు రెమ్యునరేషన్ ను ఇచ్చారు. మరి కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ – గోపీకృష్ణ మూవీస్ – టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం వారికీ నష్టాలనే మిగిలిచేలా ఉంది.
Also Read: ఆ హీరోయిన్ పై ఎన్టీఆర్ ప్రత్యేక ఇంట్రెస్ట్