Racharikam Full Movie Review : తెలుగు సినిమా ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు వరుణ్ సందేశ్… ప్రస్తుతం ఆయన అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తున్నప్పటికి ఆయనకు సరైన సక్సెస్ అయితే పడడం లేదు. మరి ఏది ఏమైనా కూడా రీసెంట్ గా ఆయన ‘రాచరికం ‘ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా వరుణ్ సందేశ్ ఖాతాలో సక్సెస్ వచ్చిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే ఈ కథ 1980వ సంవత్సరంలో రాచకోట అనే గ్రామంలో స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా పొలిటికల్ ఎజెండా పెట్టుకొని ముందుకు సాగుతున్న కొంతమంది వ్యక్తుల చేతుల్లో ఒక ప్రేమ జంట ఎలా నలిగిపోయింది. అలాగే రాజకీయం అనే ముసుగులో ఎవరెవరు ఎలాంటి అరాచకాలు చేశారు… వరుణ్ సందేశ్ అప్సర రాణి గల సంబంధం ఏంట? విజయ్ శంకర్ తన ప్రేమను గెలిపించుకున్నాడా? లేదా అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాను దర్శకుడు మొదటి నుంచి చివరి వరకు చాలా హింసాత్మకమైన విధానంలోనే తీసుకెళ్లాడు. అయితే ఈ సినిమాలో పర్టిక్యూలర్ గా హీరో విలన్ అనే పాత్రలను చూపించకుండా అవసరాన్ని బట్టి ఎవరికి వారు వాళ్లకు అనుకూలంగా సిచువేషన్స్ ను మార్చుకుంటూ ముందుకు సాగుతారు అనే ఒక పాయింట్ ని సినిమాలో చూపించే ప్రయత్నం అయితే చేశారు. ఇక సినిమా స్టార్టింగ్ నుంచి కూడా దర్శకుడు ప్రేక్షకుడిని సినిమాలోకి తీసుకెళ్లిన విధానం బాగుంది. కానీ మధ్యలో సినిమా కొంచెం సైడ్ ట్రాక్ వెళ్లినట్టుగా అనిపిస్తూ ఉంటుంది.
ఇక ఇంటర్వెల్ లో ఒక బలమైన ట్విస్ట్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చిన దర్శకుడు ఆ తర్వాత సినిమాని ఎంగేజింగ్ గా తీసుకెళ్లడంలో కొంతవరకు తరబడ్డాడనే చెప్పాలి… ముఖ్యంగా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో ఆయన కొంతవరకు ఫెయిల్ అయ్యాడు. ప్రతి క్యారెక్టర్ కి ఒక ఆర్కును సృష్టించి ఆ క్యారెక్టర్ తాలూకు ఇంపార్టెన్స్ ని చూపించడం లో ఆయన కొంతవరకు వెనకబడ్డాడు…
అందువల్లే ఒక్కో క్యారెక్టర్ తన పరిధిని దాటి ప్రవర్తిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మరి మొత్తానికైతే ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని అనుకున్నప్పటికి స్క్రీన్ ప్లే చాలా వరకు తేడా కట్టడంతో ప్రేక్షకులకు ఒక రకమైన బోర్ ఫీల్ అయితే కలుగుతుంది. మరి ఎలాంటి అనవసరపు సీన్లు లేకుండా స్క్రీన్ ప్లే ని చాలా ఎంగేజింగ్ గా రాసుకొని ఉంటే ఈ సినిమా రిజల్ట్ మరోలా ఉండేది. ఇక మ్యూజిక్ కూడా అంత పెద్దగా వర్కౌట్ కాలేదు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా భారీగా ఎలివేట్ అయితే అవ్వలేదు. సిచ్యువేషన్ కు తగ్గట్టుగా మ్యూజిక్ అయితే ఇచ్చారు. కానీ సీన్స్ ని ఎలివేట్ చేయడంలో మ్యూజిక్ చాలా వరకు వెనుకబడిపోయిందనే చెప్పాలి…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో అప్సర రాణి మెయిన్ రోల్లో నటించింది. నిజానికి ఈ సినిమాకి ఆమె క్యారెక్టర్ కొంతవరకు ప్లస్ గా మారిందనే చెప్పాలి. ఆమె యాక్టింగ్ చాలా అద్భుతంగా ఉన్నప్పటికి ఆమె క్యారెక్టర్ లో ఉన్న ఆర్క్ ను దర్శకుడు క్లారిటీ గా పోట్రే చేయలేకపోయాడు. అలాగే ఆ క్యారెక్టర్ ని తీర్చిదిద్దిన విధానం కూడా ప్రేక్షకుడికి కనెక్ట్ అవ్వలేదు.
ఇక వరుణ్ సందేశ్ కూడా చాలా రోజుల తర్వాత ఒక మంచి పాత్రను పోషించినప్పటికి ఆయన పాత్రకి కంన్క్లుజన్ ఇవ్వడం లో దర్శకుడు కొంత వరకు తడబడ్డాడు… ఇక విజయ్ శంకర్ ఈ సినిమాలో కీలకపాత్ర పోషించినప్పటికి ఆయన తన నటన ప్రతిభను చాలావరకు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చాడు. కానీ సినిమా అప్పటికే గాడి తప్పడంతో ఆయన క్యారెక్టర్ తో ప్రేక్షకుడు కనెక్ట్ అవ్వలేకపోయాడు. దాంతో సినిమా కి అతనికి సంబంధం లేదు అన్నట్టుగా కొన్ని సీన్స్ అయితే రావడం వల్ల ఆయన మంచి పర్ఫామెన్స్ ఇచ్చినా కూడా ఆ క్యారెక్టర్ ప్రేక్షకుడికి కనెక్ట్ కాలేకపోయింది… ఇక మిగతా ఆర్టీస్టులందరు వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…
టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ అంత పెద్దగా వర్కౌట్ కాలేదు. అలాగే సినిమాటోగ్రాఫర్ కూడా కొన్ని సీన్స్ లో బాగా విజువల్స్ ను బాగా అందించినప్పటికి సినిమా మొత్తం చూస్తుంటే మాత్రం సీరియల్ ని చూసిన ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంటుంది. సినిమాటోగ్రాఫర్ కూడా ఈ సినిమాలో పెద్దగా మేటర్ లేదు కాబట్టి ఆయన కూడా పెద్దగా ఫోకస్ చేసినట్టుగా కనిపించలేదు. మరి ఏది ఏమైనా కూడా టెక్నికల్ అంశాల విషయంలో కూడా ఈ సినిమా చాలా వరకు నిరాశపరిచిందనే చెప్పాలి…
ప్లస్ పాయింట్స్
ఫస్టాఫ్ లో కొన్ని సీన్లు
అప్సర రాణి యాక్టింగ్
మైనస్ పాయింట్స్
స్క్రీన్ ప్లే
మ్యూజిక్
సినిమాటోగ్రఫీ…
రేటింగ్
ఈ సినిమాకు మేమిచ్చే రేటింగ్ 2/5
