Race Gurram Re Release Box Office: నిన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) పుట్టిన రోజు ని అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత గ్రాండ్ గా జరుపుకున్నారో మన కళ్లారా చూసాము. ఈ సందర్భంగా ఆయన కెరీర్ లో ఒక మైలు రాయిగా నిల్చిన ‘రేసు గుర్రం’ చిత్రాన్ని మరోసారి గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. ఈ సినిమాని అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కానీ కలెక్షన్స్ మాత్రం నిల్. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఈ చిత్రం అభిమానులను తీవ్ర స్థాయిలో నిరాశకు గురి చేసింది. కెరీర్ లోనే అత్యుత్తమ కమర్షియల్ చిత్రం. అంతే కాదు , టాలీవుడ్ లో బెస్ట్ కమర్షియల్ చిత్రాల్లో ఒకటిగా ‘రేసు గుర్రం’ చిత్రం కచ్చితంగా నిలుస్తుంది. అలాంటి హిస్టారికల్ బ్లాక్ బస్టర్ చిత్రానికి రీ రిలీజ్ లో కచ్చితంగా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుందని అనుకున్నారు కానీ, ఇంత తక్కువ గ్రాస్ నమోదు అవుతుందని మాత్రం అనుకోలేదు.
Also Read: డేవిడ్ మిల్లర్.. అప్పుడు.. ఇప్పుడు.. నష్ట జాతకుడు
నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి కేవలం 85 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే నమోదు అయ్యాయి. ఇక్కడ మాత్రం డీసెంట్ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది అనే చెప్పాలి. అదే విధంగా సీడెడ్ లో కూడా ఈ చిత్రానికి దాదాపుగా 29 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఇక్కడ కూడా ఓపెనింగ్ అదిరిపోయింది. ఇక అల్లు అర్జున్ కి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి ఉత్తరాంధ్ర లో కూడా ఈ చిత్రానికి 24 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఓవరాల్ గా ఈ మూడు ప్రాంతాల్లో మంచి గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యింది. ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే గుంటూరు జిల్లా నుండి 8 లక్ష 36 వేల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అవ్వగా, తూర్పు గోదావరి జిల్లా నుండి 11 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి.
అదే విధంగా కృష్ణ జిల్లా నుండి 9 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు, నెల్లూరు జిల్లా నుండి 5 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు, పశ్చిమ గోదావరి జిల్లా నుండి 6 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు ఈ చిత్రానికి నమోదు అయ్యాయి. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ ప్రాంతాలకు కలిపి ఈ చిత్రానికి మరో 20 లక్షల రూపాయిల గ్రాస్, ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 1 కోటి 90 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యినట్టు తెలుస్తోంది. ఇతర హీరోల రీ రిలీజ్ సినిమాల గ్రాస్ కంటే తక్కువే అయినప్పటికీ , అల్లు అర్జున్ కెరీర్ లో బెస్ట్ రీ రిలీజ్ ఓపెనింగ్స్ ని సాధించిన సినిమాగా నిల్చింది ఈ చిత్రం. కానీ ఇంత మంచి సినిమాకు భారీ ఓపెనింగ్స్ ని ఊహించారు , అది జరగలేదు.