Race Gurram Re Release: టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ మళ్లీ ఊపందుకుంది. ఈ సమ్మర్ కి పవన్ కళ్యాణ్ మినహా, మిగిలిన స్టార్ హీరోల నుండి ఎలాంటి సినిమాలు రాకపోవడం తో అభిమానులు తీవ్ర స్థాయిలో నిరాశకు గురయ్యారు. థియేటర్స్ కూడా ఖాళీగా ఉన్నాయి, అనేక సెంటర్స్ లో మూతపడ్డాయి కూడా. ఇలాంటి సమయంలో రీ రిలీజ్ సినిమాలు థియేటర్స్ కి సరికొత్త ఊపిరిని అందించాయి. రీసెంట్ గా విడుదలైన ‘కాంచన’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 6 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. దీంతో ఏప్రిల్ 8 న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) పుట్టినరోజు కావడం తో ఆయన కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన ‘రేసు గుర్రం’ చిత్రాన్ని ఏప్రిల్ 8 న విడుదల చేయబోతున్నారు. ఏ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని ప్రాంతాల్లో మొదలయ్యాయి.
అయితే బుకింగ్స్ మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. హైదరాబాద్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ , మరియు కూకట్ పల్లి థియేటర్స్ లో తప్ప, ఈ చిత్రానికి ఎక్కడ టికెట్స్ అమ్ముడుపోలేదు. ఈ రెండు ప్రాంతాల్లో కూడా షోస్ ని ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళు టికెట్స్ బ్లాక్ చేసుకున్నారు. అవి ఇప్పుడు ఆఫ్ లైన్ లో అమ్ముడుపోవడం చాలా కష్టం గా మారింది. ఇక ఓవర్సీస్ లో అయితే ఈ సినిమా పరిస్థితి వర్ణనాతీతం. 99 షోస్ ని నార్త్ అమెరికా లో ఇప్పటి వరకు షెడ్యూల్ చేశారు. ఇప్పటి వరకు కేవలం 88 టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోయింది. గ్రాస్ దాదాపుగా 800 డాలర్లు వచ్చాయి. అంటే యావరేజ్ గా షో కి ఒక్క టికెట్ కూడా అమ్ముడుపోలేదు అన్నమాట. ఇంతటి దారుణమైన ట్రెండ్ ఈమధ్య కాలం లో ఏ రీ రిలీజ్ కి కూడా లేదు.
ప్రభాస్ నటించిన ‘మున్నా’ చిత్రాన్ని రీసెంట్ గానే విడుదల చేశారు , ఈ చిత్రానికి నార్త్ అమెరికా నుండి 4 వేల డాలర్లు వస్తే వేరే లెవెల్ లో ట్రోల్స్ పడ్డాయి. కానీ ‘రేసు గుర్రం’ చిత్రానికి అందులో సగం కూడా వచ్చేలా లేవు. మున్నా అంటే ఫ్లాప్ చిత్రం , పైగా ప్రభాస్ అభిమానులు అంతగా ఆసక్తి కూడా చూపలేదు. కానీ ‘రేసు గుర్రం’ చిత్రాన్ని అభిమానులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయినప్పటికీ ఇంతటి దారుణమైన బుకింగ్స్ జరుగుతున్నాయి అంటే , అల్లు అర్జున్ కి అసలు నిజంగానే ఫ్యాన్ బేస్ ఉందా అంటూ సోషల్ మీడియా లో ట్రోల్స్ వేరే లెవెల్ లో పడుతున్నాయి. మరి రీ రిలీజ్ కి ముందు రోజు అడ్వాన్స్ బుకింగ్స్ పికప్ అవుతుందా లేదా అనేది చూడాలి .
