spot_img
Homeఎంటర్టైన్మెంట్Carmeni Selvam Movie Review: కార్మేని సెల్వం.. ప్రేక్షకుల ఖర్మం

Carmeni Selvam Movie Review: కార్మేని సెల్వం.. ప్రేక్షకుల ఖర్మం

Carmeni Selvam Movie Review: రివ్యూ: కార్మేని సెల్వం

నటీనటులు: సముద్రఖని, గౌతమ్ మేన్, లక్ష్మీ ప్రియా చంద్రమౌళి, అభినయ తదితరులు.
సంగీతం: రామానుజన్
ఛాయాగ్రహణం: యువరాజ్ దక్షణ్
ఎడిటింగ్: జగన్ ఆర్ వి – దినేష్. యస్
దర్శకత్వం: రామ్ చక్రి
నిర్మాత: అరుణ్ రంగరాజులు

ప్రస్తుతం హిట్ సినిమాలలో ఉండే కామన్ పాయింట్లు ఏంటి అంటే మొదట ‘A’ సర్టిఫికెట్ ఉండాలి. రెండోది మూడున్నర గంటల పైన సినిమా నిడివి ఉండాలి. ఇలాంటి ట్రెండ్ కు పూర్తి వ్యతిరేకంగా క్లీన్ ‘U’ సర్టిఫికెట్ తో రెండున్నర గంటల డ్యూరేషన్ తో ఎవరైనా సినిమా తీస్తే ఆశ్చర్యమే. వెర్సటైల్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న సముద్ర ప్రధాన పాత్రలో రామ్ చక్రి దర్శకత్వంలో తెరకెక్కిన ‘కార్మేని సెల్వం’ సరిగ్గా ఇలాంటిదే. తమిళ డబ్బింగ్ సినిమా కాబట్టి టైటిల్ లో ఉండే కార్మేని అంటే ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. మీరూ ఆడగొద్దు. ఆ పదా’ర్థం తెలుసుకోవాలని మరీ ఆసక్తిగా ఉంటే గూగుల్ నో చాట్ జీపీటీనో అడిగి తెలుసుకోండి. ఇక ట్రైలర్ తోనే సినిమా ఒక సాఫ్ట్ ఎమోషనల్ డ్రామా అని తెలిసిపోయింది. మరి ఈ హార్డ్ జెనరేషన్ ఆడియన్స్ ను ఇలాంటి సున్నితమైన డ్రామాతో మెప్పించగలిగారా లేదా అనేది రివ్యూలో చూద్దాం.

సంపత్(గౌతమ్ మేనన్) ఆనే ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర సెల్వం(సముద్రఖని) డ్రైవరుగా పనిచేస్తుంటాడు. పనిలో చాలా సిన్సియర్ గా ఉండే సెల్వం తన భార్య శాంతి (లక్ష్మీ ప్రియ), కొడుకు బాలుతో కలిసి ఉన్నదానితో సంతృప్తిగా జీవిస్తుంటాడు. భార్య శాంతి కూడా ఒక ఇడ్లీ బండి నడుపుతూ భర్తకు చేదోడువాదోడుగా ఉంటుంది. ఒకరోజు సెల్వం కుటుంబం తన చెల్లి ఇంట్లో శుభకార్యానికి వెళ్ళడం, అక్కడ వారికి అవమానం ఎదురవుతుంది. ఇలాంటి అవమానాలు ఇంకెన్నాళ్ళు భరించాలి? జీవితంలో గొప్పగా స్థిరపడాలి అని శాంతి భర్తతో చెప్పడంతో సెల్వం కూడా ఇక ఎలాగైనా డబ్బు సంపాదించాలని అనుకుంటాడు. అదే సమయంలో తన యజమాని సంపత్ విదేశాలకు వెళ్ళడంతో, అతనికి తెలియకుండా కారును క్యాబ్ లాగా తిప్పడం, ప్లాట్ కొనేందుకు అప్పులు చేయడం మొదలుపెడతాడు. మెల్లగా అప్పుల ఊబిలో కూరుకుపోతాడు. ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడేందుకు సెల్వం ఏం చేశాడు? తన ప్రయత్నాలు ఫలించాయా? చివరికి భార్యపిల్లలతో సంతోషంగా ఉండగలిగాడా అనేది మిగతా కథ.

ఉన్నదాంట్లో సంతృప్తి పడకుండా పక్కవారితో పోటీ పెట్టుకుని, తమ స్థాయికి మించి అప్పులు చేయడం, వాటిని తీర్చడానికి నిరంతరం పరిగెడుతూ మనశ్శాంతిని దూరం చేసుకోవడం అనవసరం ఆనే థీమ్ ను దర్శకుడు ఈ సినిమాతో ప్రేక్షకులకు చెప్పదలుచుకున్నాడు. థీమ్ బాగానే ఉంది కానీ ఎగ్జిక్యూషన్ లో పూర్తిగా సీరియల్ లాగా మారిపోయింది. సినిమాలో అసలైన కాన్ ఫ్లిక్ట్ సెల్వం అప్పుల పాలైనప్పుడు ప్రేక్షకులు ఫీల్ అవ్వాలి. కానీ ఇదంతా ఏదో మోరల్ లెసన్ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సినిమాను చూడడానికి కాసులు ఖర్చుచేసి వచ్చే ప్రేక్షకుడికి క్లాసులు ఎందుకు నచ్చుతాయి? ఒకవేళ చెప్పాలనుకున్నా ఎంటర్టైనింగ్ గా ఉంటూనే అంతర్లీనంగా మెసేజ్ ఉంటాలి. అదే కాకుండా రైటింగ్ డిపార్ట్మెంట్ పూర్తిగా అవుట్ డెటెడ్ గా ఉంది. ఏదో సభ్య సమాజానికి దుబారా వద్దు ఆనే సందేశం ఇద్దామని ఉదాత్తమైన ఆలోచనలతో రాసుకుంటూ పోయారు. కానీ ఈ సందేశం కోసం టికెట్ డబ్బు ఖర్చు చేయడం కూడా దుబారా అవుతుంది ఆనే బేసిక్ పాయింట్ మర్చిపోయారు. అక్కడక్కడా కొన్ని సీన్లు బాగున్నప్పటికీ సినిమా మాత్రం ఒక సీరియల్ లాగా, జీడిపాకం లాగా సాగింది.

నేపథ్య సంగీతం బాగుంది కానీ తమిళ పాటలు తెలుగులోకి మారేసరికి అవి ప్రేక్షకులకు శిక్షగా అనిపిస్తాయి. ఒక్క పాట కూడా వినసొంపుగా లేదు. సినిమా మొత్తం మీద నాలుగైదు డైలాగులు మాత్రం బాగున్నాయి. డైలాగులన్నీ దాదాపుగా అచ్చతెలుగులో ఉండడం వల్ల జెన్ జీ ప్రేక్షకులకు అర్థం కావడం కష్టమే. సినిమాటోగ్రఫీ మాత్రం చక్కగా ఉంది. ఎడిటర్ ఈ సినిమాలో కనీసం అరగంట కత్తెర వేసినా కథకు ఎటువంటి ఇబ్బంది లేదు. దుబారా లేకుండా చాలా డీసెంట్ బడ్జెట్ లో సినిమాను పూర్తి చేసినందువల్ల ఎక్కడా రిచ్ లుక్ కనిపించదు.

సముద్రఖని నటన చాలా బాగుంది. కానీ ఆయన స్వయంగా తెలుగులో డబ్బింగ్ చెప్పడం వల్ల చాలా చోట్ల పదాలు సరిగా పలకలేదు. దాని వల్ల కొన్ని సీన్లలో ఇంటెన్సిటీ తగ్గింది. సంపత్ పాత్రలో గౌతమ్ మేన్, శాంతిగా లక్ష్మీ ప్రియ యాక్టింగ్ డీసెంట్ గా ఉంది. ఇక అభినయ పాత్ర కూడా ఓకే.

ఫన్ లేకుండా సీరియస్ సందేశాలను ఇష్టపడేవారు, సీరియల్స్ అంటే చెవులు, ముక్కు కోసుకునే వారికి ఈ సినిమా పిచ్చపిచ్చగా నచ్చే అవకాశం ఉంది. మిగతా వారు లైట్ తీసుకోండి.

సినిమాలో బాగోలేనివి ఇవీ:

1. సీరియల్ తరహా ట్రీట్మెంట్
2. పాటలు
3. 90 ల నాటి కథనం

ఇందులో ఏం బాగున్నాయో తెలుసా?

1. సముద్రఖని, లక్ష్మీప్రియల నటన
2. సినిమాటోగ్రఫీ

రేటింగ్: 1.75/5

ఫైనల్ వర్డ్: సీరియల్ ప్రియుల కోసం

 

 

Ramu Kovuru
Ramu Kovuruhttps://oktelugu.com/
Ramu Kovuru is a writer having 10 plus years of experience. He has worked for websites writing movies content. He is also woriking in Telugu film industry as a writer for the past 5 years. He has good knowledge in cinema across the languages. He contributes to movie reviews.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular