Race Gurram re release: సాధారణంగా స్టార్ హీరోల పుట్టినరోజు సమయం లో, వాళ్ళ కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిల్చిన చిత్రాలను రీ రిలీజ్ చేస్తుంటారు. వాటికి బాక్స్ ఆఫీస్ వద్ద కనీస స్థాయిలో అయినా గ్రాస్ వసూళ్లు నమోదు అవుతుంటాయి. అది సర్వ సాధారణం. కానీ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) అభిమానులకు మాత్రం ఈసారి దారుణమైన అవమానాన్ని ఎదురుకోక తప్పదని అనిపిస్తోంది. ఆయన కెరీర్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లిన, పీక్ కమర్షియల్ చిత్రం ‘రేసు గుర్రం'(#RaceGurram4K) ని ఈ నెల 8 న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల చేయబోతున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అన్ని ప్రాంతాల్లోనూ మొదలయ్యాయి. కానీ ఒక్క చోట కూడా ఈ చిత్రానికి మినిమం గ్యారంటీ బుకింగ్స్ జరగడం లేదు. ఒక్క హైదరాబాద్ లో మాత్రమే ఈ చిత్రం ఉనికిని కాపాడుకుంది.
ఆన్లైన్ ద్వారా హైదరాబాద్ లో ఈ చిత్రానికి ట్రాక్ అయిన గ్రాస్ వసూళ్లు దాదాపుగా 42 లక్షల వరకు ఉంది. అది కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్స్, కూకట్ పల్లి హోసింగ్ బోర్డు వంటి టాప్ సెంటర్స్ నుండి నమోదైన వసూళ్లు. ఈ ప్రాంతాల్లో చిన్న హీరోల సూపర్ హిట్ రీ రిలీజ్ లకు కూడా హౌస్ ఫుల్ బోర్డ్స్ పడుతాయి. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే, అల్లు అర్జున్ కి హైదరాబాద్ లో రెండు మల్టీ ప్లెక్స్ థియేటర్స్ ఉన్నాయి. వాటిల్లో కూడా ఈ చిత్రానికి హౌస్ ఫుల్స్ నమోదు అవ్వలేదంటేనే అర్థం చేసుకోవచ్చు, ఈ చిత్రం పరిస్థితి ఎలా ఉంది అనేది. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 65 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే నమోదు అయ్యాయి. ఓవర్సీస్ లో అయితే ఈ చిత్తానికి ప్రింట్ ఖర్చులు కూడా మిగిలేలా లేవు.
అక్కడ ఈ చిత్రం ప్రింట్ ఖర్చులను రాబట్టాలంటే, కనీసం 4 వేల డాలర్లు రాబట్టాలి. కానీ ఇప్పటి వరకు అక్కడ ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 1800 డాలర్లు మాత్రమే నమోదు అయ్యాయి. అంటే 200 టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి అన్నమాట. ఇది అత్యంత దారుణమైన వసూళ్లు అనే చెప్పాలి. తెలుగు కమర్షియల్ సినిమాలకు క్రేజ్ తగ్గిపోవడం వల్లే, ఈ చిత్రానికి ఇంత తక్కువ వసూళ్లు నమోదు అవుతున్నాయా?, లేదంటే అల్లు అర్జున్ రేంజ్ ఇంతేనా అనే సందేహాలు ట్రేడ్ పండితుల్లో కలుగుతున్నాయి. వేరే ఏ సందర్భం లో అయినా ఈ చిత్రాన్ని విడుదల చేసినప్పుడు ఇంత తక్కువ వసూళ్లు నమోదు అయితే అందరూ అర్థం చేసుకోగలరు. కానీ పుట్టినరోజు నాడు ఇంత తక్కువ వసూళ్లు నమోదు అవ్వడం వల్లే, ఈ రేంజ్ చర్చలు నడుస్తున్నాయి.