https://oktelugu.com/

రాశి ఖన్నా డేరింగ్‌ స్టెప్‌..

తెలుగులో ఇప్పుడు రాశి ఖన్నా హవా నడుస్తోంది. మూడు విజయాలు, ఆరు ఆఫర్లు అన్నట్టుంది ఆమె పరిస్థితి. యువ హీరోతో పాటు స్టార్లతోనూ నటిస్తూ దూసుకుపోతోందామె. ఉత్తరాది నుంచి వచ్చినా చక్కగా తెలుగు మాట్లాడుతూ తన అందచందాలతో అభిమానులను ఆకట్టుకుంటోంది. తన తొలి చిత్రం ఊహలు గుసగుసలాడే తోనే మెప్పించిన ఈ ఢిల్లీ బ్యూటీ ఆ తర్వాత అంచలంచెలుగా ఎదుగుతూ టాలీవుడ్‌లో ఇప్పుడు డిమాండ్‌ ఉన్న నటిగా ఎదిగింది. మధ్యలో కొస్త బొద్దుగా మారి ఇబ్బంది పడ్డా.. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 25, 2020 / 06:01 PM IST
    Follow us on


    తెలుగులో ఇప్పుడు రాశి ఖన్నా హవా నడుస్తోంది. మూడు విజయాలు, ఆరు ఆఫర్లు అన్నట్టుంది ఆమె పరిస్థితి. యువ హీరోతో పాటు స్టార్లతోనూ నటిస్తూ దూసుకుపోతోందామె. ఉత్తరాది నుంచి వచ్చినా చక్కగా తెలుగు మాట్లాడుతూ తన అందచందాలతో అభిమానులను ఆకట్టుకుంటోంది. తన తొలి చిత్రం ఊహలు గుసగుసలాడే తోనే మెప్పించిన ఈ ఢిల్లీ బ్యూటీ ఆ తర్వాత అంచలంచెలుగా ఎదుగుతూ టాలీవుడ్‌లో ఇప్పుడు డిమాండ్‌ ఉన్న నటిగా ఎదిగింది. మధ్యలో కొస్త బొద్దుగా మారి ఇబ్బంది పడ్డా.. తర్వాత స్లిమ్‌గా తయారైంది. విజయ్‌ దేవరకొండ సరసన బోల్డ్‌గా నటించిన వరల్డ్‌ ఫేమస్‌ లవర్ బోల్తా కొట్టినా ఈ మధ్యే ప్రతిరోజూ పండగే, వెంకీమామతో రెండు విజయాలు సొంతం చేసుకుందామె. తన క్లోజ్‌ ఫ్రెండ్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ బాలీవుడ్‌కు చెక్కేయడంతో తెలుగులో అవకాశాలన్నీ రాశీకే దక్కుతున్నాయి. ఈ ఏడాది ఆమె చేతిలో మరో నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. రాశి స్పీడు చూస్తుంటే తొందర్లోనే తెలుగులో నంబర్ వన్‌ హీరోయిన్‌ అయ్యేలా కనిపిస్తోంది. ఈ మధ్యే తమిళ్‌ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి.

    Also Read: ‘ఆచార్య’ మోషన్ పోస్టర్ పై వివాదం

    ఇలా వరుస సినిమాలతో ఇంత బిజీగా ఉన్న టైమ్‌లో రాశి అనూహ్య నిర్ణయం తీసుకుంది. వెబ్‌ వరల్డ్‌లో అడుగు పెట్టేందుకు డేర్ చేసింది. ప్రస్తుతం అన్ని భాషల్లో వెబ్‌ సిరీస్‌ల హవా పెరుగుతోంది. పలువురు స్టార్ హీరోలు, హీరోయిన్లు ఇప్పటికే వెబ్‌ సిరీస్‌ల బాట పట్టారు.ఈ లిస్ట్‌లో సమంత నుంచి కాజల్‌ అగర్వాల్ వరకూ నటీమణులు ఉన్నారు. రాశి ఖన్నా కూడా వారి బాటలో నడవాలని డిసైడైంది. అయితే, ఓ హిందీ వెబ్‌ సిరీస్‌కు ఆమె సంతకం చేసింది. అది తొందర్లోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. వెబ్‌ సిరీస్‌ గురించి మేకర్స్‌ ఇంకా అధికారిక ప్రకటన చేయకపోయినా రాశి ఒప్పుకున్న వార్త మాత్రం చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం తెలుగు, తమిళ్‌లో పలు భారీ బడ్జెట్‌ సినిమాల కోసం రాశితో దర్శక నిర్మాతలు చర్చలు జరుపుతున్నాయి. ఇక, మాస్‌ మహారాజ రవితేజతో రాశి మరోసారి రొమాన్స్‌ చేయనుంది. రమేశ్‌ వర్మ దర్శకత్వం వహించే ఈ చిత్రానికి రాశిని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ సినిమాకు కిలాడి అనే టైటిల్‌ను ఖరారు చేశారని తెలుస్తోంది.