విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదంలో కరోనా చికిత్స కోసం వచ్చిన 12మంది అమయాకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ఘటనలో అందరి తప్పు ఉంది. స్వర్ణ ప్యాలెస్ లో ఆసుపత్రి నిర్వహించిన రమేశ్ ఆసుపత్రికి.. జాగ్రత్తలు తీసుకోని స్వర్ణ ప్యాలెస్ హోటల్ నిర్వాహకులకు.. ఈ ఆసుపత్రికి పర్మిషన్ ఇచ్చిన ఫైర్ డిపార్ట్ మెంట్ కి.. హోటల్ ను కోవిడ్ సెంటర్ గా మార్చినందుకు అనుమతులు ఇచ్చిన కలెక్టర్, డీఎంహెచ్.వో ఇతర అధికారులకు కూడా ఇందులో తప్పు ఉంది. ఇందులో ఒక్కరిని తప్పు పట్టడానికి లేదు. ఇది ఆస్పత్రి కాకముందే ప్రభుత్వమే ఎయిర్ పోర్ట్ క్వారంటైన్ సెంటర్ గా నడిపింది. దీంతో ఒక్కరిపై నెపాన్ని నెట్టడానికి లేదు.
Also Read: ‘ఆచార్య’ మోషన్ పోస్టర్ పై వివాదం
కానీ ఈ మొత్తం వ్యవహారంలో జగన్ సర్కార్ రమేశ్ ఆస్పత్రినే బాధ్యులుగా చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయడానికి సిద్ధమైంది. దీనిపై డాక్టర్ రమేశ్ హైకోర్టును ఆశ్రయించాడు. ఇక టాలీవుడ్ హీరో రామ్ కూడా తన బాబాయ్ అయిన డాక్టర్ రమేశ్ ను వెనకేసుకొచ్చాడు. ఇది టీడీపీ, వైసీపీల మధ్య రాజకీయవైరంగా మారి మాటల యుద్ధం కూడా నడిచింది. తప్పు మీదంటే మీదని అందరూ నెపాన్ని తప్పించుకుంటున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఇంతకీ తప్పు అందరిదీ అని.. రమేశ్ ఆస్పత్రిని డాక్టర్లను ఎలా బాధ్యులను చేస్తారని తాజాగా హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని కడిగేసింది.
ఈ క్రమంలోనే డాక్టర్ రమేశ్ తోపాటు ఆస్పత్రిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి జగన్ సర్కార్ కు షాకిచ్చింది. అదే క్రమంలో డాక్టర్ రమేశ్ కు ఊరటనిచ్చింది.
స్వర్ణ ప్యాలెస్ ప్రమాదంలో తన అరెస్ట్ చేయకుండా స్టే విధించాలని డాక్టర్ రమేశ్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో డాక్టర్ రమేశ్ విషయంలో తదుపరి చర్యలు నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశించింది. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రమేశ్ హాస్పిటల్ పై ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ పై కూడా హైకోర్టు స్టే విధించింది.
Also Read: సీక్రెట్: ‘హన్సిక బ్యాగ్’లో ఏముందో మీకు తెలుసా?
ఏళ్ల తరబడి స్వర్ణ ప్యాలెస్ హోటల్ నిర్వహించారని.. ఇక హోటల్ లో కోవిడ్ సెంటర్ కు అనుమతిచ్చిన కలెక్టర్, జిల్లా వైద్యాధికారి కూడా ప్రమాదానికి బాధ్యులే కదా అని హైకోర్టు ప్రశ్నించింది. ఈ కేసులో అధికారులను నిందితులుగా చేరుస్తారా అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. డాక్టర్ రమేశ్ ను అరెస్ట్ చేయకుండా ఉంటారా? లేక ఉత్తర్వులు ఇవ్వాలా అని ఆగ్రహించింది. దీంతో ప్రభుత్వ లాయర్ దీనిపై విచారణ కొనసాగుతోందని.. అరెస్టులు ఇంకా చేయలేదని హైకోర్టుకు తెలిపారు.