R Narayana Murthy: కేవలం తాను నమ్ముకున్న సిద్ధాంతాలను వెండితెర మీద చూపించి, నలుగురిలో చైతన్యం కలిగించాలి అనే తపనతో ఉండే అతి తక్కువ మంది హీరోలలో ఒకరు ఆర్ నారాయణమూర్తి(R Narayana Murthy). ఈయన చరిత్ర చూస్తే ఎవరికైనా చాలా గర్వం గా ఉంటుంది. ఆయన తీసే సినిమాలు ఆడిన ఆడకపోయినా, తీస్తూనే ఉంటాడు. ఆయనలో ఉన్న అద్భుతమైన నటుడిని గుర్తించి, ఇతర హీరోల సినిమాల్లో పవర్ ఫుల్ రోల్స్ చేయాల్సిన సందర్భాలు ఎన్నో వచ్చాయి. కానీ నారాయణ మూర్తి ఆ అవకాశాలను సున్నితంగా రిజెక్ట్ చేసుకుంటూ వచ్చాడు. ఎన్టీఆర్(Puri Jagannath) ‘టెంపర్’ చిత్రం లో పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) క్యారక్టర్ ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. టాలీవుడ్ హిస్టరీ లోనే ఐకానిక్ రోల్స్ లో ఒకటి అది. ఆ పాత్ర ముందుగా నారాయణమూర్తి వద్దకే వెళ్ళింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆ క్యారక్టర్ ని చేయాల్సిందిగా ఎంతో రిక్వెస్ట్ చేసాడు, కానీ మూర్తి గారు చేయలేదు.
Also Read: రియల్ లైఫ్ లో నటి ప్రగతి ఎలా ఉంటుంది? ఎఫ్ 3 నటుడు బయటపెట్టిన నిజాలు!
అయితే పూరి జగన్నాథ్ అంతలా రిక్వెస్ట్ చేసినా ఒప్పుకోని ఆర్ నారాయణమూర్తి, ‘దసరా’ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) రిక్వెస్ట్ చేయగానే ఒప్పుకున్నాడా అనే సందేహాలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే నిన్న రాత్రి శ్రీకాంత్ ఓదెల ఆర్ నారాయణమూర్తి తో కలిసి ఒక ఫోటో ని దిగి, దానిని తన ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేశాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లోనే హాట్ టాపిక్ గా మారింది. ఈ ఫోటో క్రింద కామెంట్స్ లో ‘కలర్ ఫోటో’ డైరెక్టర్ సందీప్ రాజ్ మాట్లాడుతూ ‘వెంటనే ఆయన్ని మన సినిమాలోకి తీసుకో’ అని అంటాడు. ఈ కామెంట్ కూడా బాగా వైరల్ అయ్యింది. శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) తో ‘ది ప్యారడైజ్'(The Paradise Movie) అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది.
రీసెంట్ గానే విడుదలైన గ్లిమ్స్ వీడియో కి ఎలాంటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూసాము. ఈ చిత్రంలో ఒక పవర్ ఫుల్ క్యారక్టర్ కోసం శ్రీకాంత్ ఓదెల నారాయమూర్తి ని సంప్రదించారట. మరి ఆయన ఒప్పుకున్నాడో లేదో పూర్తి స్థాయిలో క్లారిటీ రాలేదు కానీ, అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే ఆయన ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తుంటి. తెలంగాణ పోరాట పటిమని చాటి చెప్పే విధంగా ఈ సినిమా స్టోరీ ఉండడం వల్లే ఆయన నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఉగాది లోపు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే నారాయణ మూర్తి కేవలం ఈ ఒక్క సినిమాలో మాత్రమే చేస్తాడా?, లేదా భవిష్యత్తులో కూడా ఇలాంటి క్యారక్టర్ రోల్స్ చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే క్రేజీ సినిమాని వచ్చే ఏడాది మార్చి 26 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.