https://oktelugu.com/

నటుడు ఆర్.నారాయణమూర్తి అరెస్ట్

విప్లవ చిత్రాల ద్వారా సుపరిచితమైన నటుడు, దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి. తనదైన శైలిలో చిత్రాలు రూపొందిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన రైతుల ఆందోళన కార్యక్రమంలో ఆయన అరెస్టు చర్చనీయాంశంగా మారింది. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సోమవారం చలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. రాజ్ భవన్ కు వెళ్లే రైతులకు అనుమతి లేనందున వారిని అదుపులోకి తీసుకున్నారు. కానీ రైతులు వినలేదు. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : June 28, 2021 / 04:49 PM IST
    Follow us on

    విప్లవ చిత్రాల ద్వారా సుపరిచితమైన నటుడు, దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి. తనదైన శైలిలో చిత్రాలు రూపొందిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన రైతుల ఆందోళన కార్యక్రమంలో ఆయన అరెస్టు చర్చనీయాంశంగా మారింది. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సోమవారం చలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

    రాజ్ భవన్ కు వెళ్లే రైతులకు అనుమతి లేనందున వారిని అదుపులోకి తీసుకున్నారు. కానీ రైతులు వినలేదు. దీంతో తిరిగి వెళ్లిపోవాలని పోలీసులు చెప్పినా రైతులు పట్టించుకోలేదు. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. అందులో నారాయణ మూర్తి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలను వెనక్కి తీసుకోవాలని సూచించారు.

    వాటితో రైతులకు నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. కేంద్రం వాటిని వెనక్కి తీసుకునేంత వరకు ఉద్యమం ఆగదని తేల్చి చెప్పారు. 2006లో బీహార్ లో తీసుకొచ్చిన రైతు చట్టాల వల్ల అక్కడ రైతులే లేకుండా పోయారు. రైతులు కూలీలుగా మారారని గుర్తు చేసుకున్నారు. కేంద్రం తీసుకొచ్చే చట్టాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.

    కేంద్రం ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాలని కోరారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా మంచి నిర్ణయం తీసుకోవవాలని సూచించారు. అప్పుడే వారి ఆర్థిక పరిస్థితి బాగుంటుందని చెప్పారు. కేంద్రం తీసుకువచ్చిన చట్టాలతో అన్నదాతలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వాటిని అమల్లోకి తీసుకురావద్దని పేర్కొన్నారు. దీనిపై ఉద్యమించేందుకు అందరు తయారుగా ఉన్నారని వివరించారు.