https://oktelugu.com/

Pushparaj and Rocky Bhai : పుష్పరాజ్ vs రాకీ భాయ్ ఇద్దరిలో ఎవరు స్ట్రాంగ్…వీళ్ళ కాంబోలో సినిమా వస్తుందా..?

సినిమా ఇండస్ట్రీ లో చాలామంది హీరోలు ఉన్నప్పటికి కొంతమంది మాత్రమే చాలా పవర్ ఫుల్ హీరోలుగా కనిపిస్తూ ఉంటారు... కారణం ఏదైనా కూడా వాళ్లను వాళ్ళు స్టార్ హీరోలుగా మార్చుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తుంటారు...ఇక ఇప్పటికే చాలా మంది హీరోలు డిఫరెంట్ సినిమాలు చేస్తున్నారు...ఇక ఏది ఏమైనా కూడా భారీ హిట్ కొట్టిన వాళ్లకి ఇక్కడ మంచి అవకాశలైతే ఉంటాయి...

Written By:
  • Gopi
  • , Updated On : February 12, 2025 / 04:36 PM IST
    Pushparaj vs Rocky Bhai

    Pushparaj vs Rocky Bhai

    Follow us on

    Pushparaj and Rocky Bhai : సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా వచ్చి పెను ప్రభంజనాన్ని సృష్టిస్తే ఆ సినిమా తాలూకు ఇంపాక్ట్ అనేది మరికొన్ని సినిమాల మీద ఉంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో యష్ హీరోగా వచ్చిన కే జి ఎఫ్ సినిమా పెను ప్రభంజనాలను సృష్టించింది. ఇక ఈ సినిమా ధాటికి బాలీవుడ్ ఇండస్ట్రీ సైతం చేతులెత్తేసిందని చెప్పాలి. కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని అతలాకుతలం చేసింది. దమ్మున్న దర్శకులు ఎవరు లేరు అంటూ కొన్ని విమర్శలైతే వచ్చేవి. కానీ ప్రశాంత్ నీల్ ఏంటో యావత్ ఇండియన్ సినిమా ప్రపంచానికి చూపించాడు… ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ఇన్స్పిరేషన్ తోనే అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప అనే సినిమా వచ్చింది. అయితే ఈ సినిమా దాదాపు కేజీఎఫ్ ను పోలి ఉంటుంది. రెండు సినిమాల్లో హీరోయిజం ఎలివేట్ చేయడమే ఎజెండా గా పెట్టుకొని దర్శకులు సినిమాలను చేశారు. ఇక అలాగే హీరో క్యారెక్టరైజేషన్ కూడా రెండు సినిమాల్లో ఇల్లీగల్ పనులు చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. తద్వారా సినిమా భారీ బజ్ రావడమే కాకుండా ఈ రెండు సినిమాలు ఇండియన్ ఇండస్ట్రీని షేక్ చేశాయి…

    ఇక ఇది చూసిన చాలామంది ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా పుష్పరాజ్ ఇద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది. ఒకరి బిజినెస్ కి మరొకరు అడ్డుపడితే ఆ రైవల్టి ఎలా ఉంటుంది అనేది చూడాలని ఉంది అంటూ చాలామంది సోషల్ మీడియా వేదికగా కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు. మరి పుష్పరాజ్ వర్సెస్ రాఖీ భాయ్ అంటూ వీళ్ళిద్దరి మధ్య ఒక సమరం అయితే నడుస్తుంది.

    ఇక వీళ్ళిద్దరూ కలిసి ఒక సినిమాలో నటిస్తే ఎవరు ఎవరి పైన పై చేయి సాధిస్తారు అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ముఖ్యంగా ఇద్దరూ కూడా ఇల్లీగల్ బిజినెస్ చేయడంలో ఆరి తేరిన వ్యక్తులు కాబట్టి అలాగే టాలెంట్ లో కూడా ఇద్దరు టాప్ రేంజ్ లో ఉంటారు.

    ఎదుటివారు ఎలా ఆలోచిస్తారో కూడా పసిగట్టు చెప్పగలిగే కెపాసిటీ ఉన్న వీళ్ళిద్దరూ శారీరకంగా కూడా చాలా దృఢంగా ఉంటారు. వాళ్ల మెంటాలిటీ ప్రకారం చూసుకున్న శారీరకంగా చూసుకున్న ఇద్దరు సమానులే కాబట్టి వీళ్లకు ఫైట్ ఉంటుంది. మరి ప్రేక్షకులు అనుకున్నట్టుగానే ఈ రెండు క్యారెక్టర్లతో సినిమా వస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది…