Anand devarakonda: సినిమాపై మరింత హైప్​ పెంచుతోన్న ‘పుష్పక విమానం’ రిలీజ్​ ప్రోమో!

Anand devarakonda: దొరసాని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. మిడిల్​క్లాస్​ మెలొడీస్​తో హీరోగా మంచి గుర్తింపు తెచ్చకున్న హీరో ఆనంద్​ దేవరకొండ. విజయ్​ దేవరకొండ తమ్ముడైనప్పటికీ.. సొంత కాళ్లపై నిలబడాలనే తాపత్రయంతో కెరీర్​లో ముందుకెళ్తున్నాడు. కాగా, ప్రస్తుతం ఆనంద్​ హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎంటర్​టైనింగ్​ సినిమా పుష్పక విమానం. ఈ సినిమా రిలీజ్​కు దగ్గరవుతున్న సమయంలో.. ప్రమోషన్స్​తో ముందుకెళ్తూ.. సినిమాపై అంచనాలు పెంచేందుకు సిద్ధమవుతోంది. నవంబరు 12న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ గ్యాప్​లోనే ప్రేక్షకులను […]

Written By: Sekhar Katiki, Updated On : November 11, 2021 3:08 pm
Follow us on

Anand devarakonda: దొరసాని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. మిడిల్​క్లాస్​ మెలొడీస్​తో హీరోగా మంచి గుర్తింపు తెచ్చకున్న హీరో ఆనంద్​ దేవరకొండ. విజయ్​ దేవరకొండ తమ్ముడైనప్పటికీ.. సొంత కాళ్లపై నిలబడాలనే తాపత్రయంతో కెరీర్​లో ముందుకెళ్తున్నాడు. కాగా, ప్రస్తుతం ఆనంద్​ హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎంటర్​టైనింగ్​ సినిమా పుష్పక విమానం. ఈ సినిమా రిలీజ్​కు దగ్గరవుతున్న సమయంలో.. ప్రమోషన్స్​తో ముందుకెళ్తూ.. సినిమాపై అంచనాలు పెంచేందుకు సిద్ధమవుతోంది. నవంబరు 12న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ గ్యాప్​లోనే ప్రేక్షకులను అలర్ట్​ చేసేందుకు ప్రోమోను విడుదల చేసింది చిత్రబృందం.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్​ మంచి పేరు తెచ్చుకుంది. ట్రైలర్​ కూడా ఎంతో భిన్నంగా చూపించారు. కాగా, ఇప్పుడు విడుదలైన ప్రోమో మరింత హిలెరియస్​గా ఉంది. ఈ సినిమాతో థియేటర్స్​లో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుందనడంలో ఎలాంటి సమస్య లేదని అనిపిస్తోంది. కాగా, ఈ మూవీకి దామోదర దర్శకత్వం వహించగా.. విజయ్​ దేవరకొండ ప్రెజెంటర్​గా వ్యవహరించారు.

గోవర్ధన్‌ రావు దేవరకొండ, విజయ్‌ మట్టపల్లి, ప్రదీప్‌ ఎర్రబెల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో గీత్‌ సైని కథానాయికగా నటిస్తుండగా… రామ్‌ మిరియాల చిత్రానికి స్వరాలందించారు. అలానే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా దర్శకుడు దామోదర పాల్గొన్నారు.  పుష్పక విమానం సినిమాలో ఆనంద్​ ఒక గమర్నమెంట్​ స్కూల్​ టీచర్​గా కనిపిస్తారని చెప్పారు. పెళ్లి చుట్టూ ఉండే పరిస్థితులను ఈ చిత్రంలో చూపించనున్నారని తెలిపారు.