https://oktelugu.com/

Pushpa: పుష్ప ఫెస్టివల్​కు అంతా సిద్ధం.. భారీ సంఖ్యలో థియేటర్లు లాక్​

Pushpa: ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప మేనియా కనిపిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్​ హీరోగా వస్తోన్న సినిమా ఇది. డిసెంబరు 17న అంటే రేపే ఈ సినిమా థియేటర్లలో సందడ చేయనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్​, ట్రైలర్లకు భారీ స్పందన లభిస్తోంది. ఈ క్రమలోనే అడ్వాన్స్ బుకింగ్స్​ హాట్​కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. మరోవైపు ఓవర్​సీస్​లోనూ సమస్య క్లియర్​ అయిపోయింది. బాలీవుడ్​లోనూ విడుదల విషయంలో సందేహం ఉందని అన్నవారికి.. సోషల్​మీడియా వేదికగా 5 […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 16, 2021 / 01:03 PM IST
    Follow us on

    Pushpa: ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప మేనియా కనిపిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్​ హీరోగా వస్తోన్న సినిమా ఇది. డిసెంబరు 17న అంటే రేపే ఈ సినిమా థియేటర్లలో సందడ చేయనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్​, ట్రైలర్లకు భారీ స్పందన లభిస్తోంది. ఈ క్రమలోనే అడ్వాన్స్ బుకింగ్స్​ హాట్​కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. మరోవైపు ఓవర్​సీస్​లోనూ సమస్య క్లియర్​ అయిపోయింది. బాలీవుడ్​లోనూ విడుదల విషయంలో సందేహం ఉందని అన్నవారికి.. సోషల్​మీడియా వేదికగా 5 భాషల్లో సినిమా విడుదలకు సిద్ధంగా ఉందని ప్రకటించి మేకర్స్ అందరి ఊహాగానాలకు చెక్​ పెట్టేశారు.

    Pushpa

    Also Read: పుష్ప లవ్ ట్రాక్ పై క్రేజీ అప్ డేట్.. ఇష్టం లేని పెళ్లి అట !

    ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన ఈ సినిమా తమిళనాడులో 280 థియేటర్లలో.. కేరళ 200, ఆంధ్ర, తెలంగాణ కలిపి 1150, కర్ణాటకలో 140పైగా థియేటర్లలో విడుదల కానుంది. మరోవైపు బాలీవుడ్​లో 600కుపైగా థియేటర్లను బుక్​చేసుకుంది పుష్ప. ఓవర్సీస్​లోనూ 600కుపైగా థియేటర్లను లాక్​చేసి..దాదాపు ప్రపంచవ్యాప్తంగా 3000 థియేటర్లకు పైగా పుష్పరాజ్ సందడి చేససేందుకు సిద్ధమయ్యాడు.

    ఎన్నో అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న పుష్పరాజ్​ ఎలా అలరిస్తాడో చూడాలని ప్రేక్షకులతో పాటు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్​గా రష్మిక నటిస్తున్న సంగతి తెలిసిందే. సునీల్​, అనసూయతో పాటు పలువురు ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బన్నీ పక్కా ఊరమాస్​ లెవెల్​లో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్​ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇందులో సమంతా ఐటెం సాంగ్​లో కనిపించనుండటం విశేషం.

    Also Read: టాప్ టెన్ లిస్ట్ లో బన్నీ.. కానీ మెగాస్టార్ కంటే తక్కువే !