Pushpa: స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా పుష్ప. ఇందులో రష్మికా హీరోయిన్గా నటిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఇందులో ఫహద్ ఫాసిల్, సునీల్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు అనసూయ కూడా మాస్ క్యారెక్టర్లో దర్శనమివ్వనుంది. ఈ ఏడాది డిసెంబరు 17న ఐదు భాషల్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది చిత్రబృందం. ఈ సినిమాతోనే బన్నీ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది చిత్రబృందం. ఈ క్రమంలోనే పుష్ప ట్రైలర్ కోసం బన్నీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, తాజా సమాచారం ప్రకారం డిసెంబరు తొలివారంలో ట్రైలర్ను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
కాగా, ఇటీవలే బన్నీ తన డైలాగ్స్ చెప్పేందుకు డబ్బింగ్ స్టూడియోకి వెళ్తున్న వీడియోను నెట్టింట అభిమానులతో పంచుకున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్ పాత్రలో కనిపించున్నారు. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. కాగా, ఇందులో ఐటెం సాంగ్లో సమంత నటించనుండటం విశేషం. త్వరలోనే ఈ పాట చిత్రీకరణ మొదలుకానుందని తెలుస్తోంది.
ఇప్పటికే అన్ని భాషల్లో డిస్ట్రిబ్యూటర్స్ కూడా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. ఈ4 ఎంటర్టైన్మెంట్ సంస్థ మలయాళంలో, తమిళంలో లైకా ప్రొడభన్స్, కన్నడలో స్వాగత్ ఎంటర్ప్రైజెస్, ఎవర్సీస్లో హంసినీ ఇంలా అన్ని చోట్ల పుష్పను విడుదల చేసేందుకు సర్వం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
Raghava Rao Gara is an Editor, He is Working from Past 2 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read More