https://oktelugu.com/

పుష్ప చిత్రం లో యాక్షన్ సీన్స్ అదరహో

సుకుమార్ చిత్రాలు నవ్యతకు పెద్ద పీట వేస్తాయి అనడంలో సందేహం అక్కరలేదు. ఆర్య దగ్గరనుంచి రంగస్థలం వరకు అన్ని ఒకదానితో ఒకటి సంబంధం లేని కదాంశాలే…. కాగా ఇప్పుడు అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ ‘పుష్ప’ సినిమాను రూపొందించనున్నాడు. కరోనా లాక్ డౌన్ తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. కేంద్రం తీరుపై ఫైర్ అవుతున్న మంత్రి తలసాని చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో తరచుగా జరిగే .. అక్రమ కలప రవాణా ప్రధాన కథాంశంగా […]

Written By:
  • admin
  • , Updated On : April 30, 2020 / 05:10 PM IST
    Follow us on


    సుకుమార్ చిత్రాలు నవ్యతకు పెద్ద పీట వేస్తాయి అనడంలో సందేహం అక్కరలేదు. ఆర్య దగ్గరనుంచి రంగస్థలం వరకు అన్ని ఒకదానితో ఒకటి సంబంధం లేని కదాంశాలే…. కాగా ఇప్పుడు అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ ‘పుష్ప’ సినిమాను రూపొందించనున్నాడు. కరోనా లాక్ డౌన్ తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

    కేంద్రం తీరుపై ఫైర్ అవుతున్న మంత్రి తలసాని

    చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో తరచుగా జరిగే .. అక్రమ కలప రవాణా ప్రధాన కథాంశంగా ఈ సినిమా నిర్మితం కానుంది. కాగా ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కి అధిక ప్రాధాన్యం ఉంటుందట …

    మత సామరస్యం సాధ్యమేనా?

    మరీ ముఖ్యంగా .. ఛేజింగ్ సీన్స్ ఒక రేంజ్ లో , అదరహో అనే స్థాయిలో వుంటాయని అంటున్నారు. ముఖ్యంగా బన్నీ లారీని ఫారెస్టు అధికారులు ఛేజ్ చేసే సీన్ ఇంతవరకు మీరు ఎపుడు కనీవినీ ఎరుగని స్థాయిలో ఉంటుందని చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే సినిమా హైలెట్స్ లో ఇదొకటి అవుతుందని చెబుతున్నారు . అసలు ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ ను హాలీవుడ్ ఫైట్ మాస్టర్ల పర్యవేక్షణలో తీయాలని అనుకొన్నారు కానీ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో, పీటర్ హెయిన్స్ ను గానీ .. కణల్ కణ్ణన్ ను గాని తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారట…. అల్లు అర్జున్ జోడీగా రష్మిక మందన్న నటించే ఈ చిత్రంలో బహు బాషల తారలు నటించనున్నారు .