
అకేషన్ ఏదైనా.. ప్రమోషన్ కీలకం. అది సినిమా అయితే.. చెప్పాల్సిన పనేలేదు. ఎంతగా ప్రమోట్ చేస్తే.. అది అంతగా జనాల్లోకి చేరుతుంది. భారీ ఓపెనింగ్స్ కు బాటలు వేస్తుంది. అయితే.. రెగ్యులర్ ప్రమోషన్ అందరూ చేస్తారు. సమ్ థింగ్ డిఫరెంట్ గా చేసినవే జనాల మనసుల్లో నాటుకుపోతాయి. బన్నీ కొత్త చిత్రం ‘పుష్ప’కు సంబంధించిన ప్రమోషన్ ఇదేవిధంగా.. భిన్నంగా ప్లాన్ చేశారు.
నిన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అప్ కమింగ్ మూవీ పుష్ప టీజర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ స్పెషల్ అకేషన్ ను వెరీ స్పెషల్ గా సెలబ్రేట్ చేశారు. హైదరాబాద్ నగరంలో అట్రాక్షన్ గా మారిన మాదాపూర్ తీగల వంతెనపై భారీ ప్రమోషన్ నిర్వహించారు.
బన్నీ ఫొటోతోపాటు ఆయన పేరును లేజర్ షో లో ప్రదర్శించారు. ఈ షో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులతోపాటు వంతెన మీద ఎంజాయ్ చేస్తున్నవారిని విశేషంగా ఆకట్టుకుంది. బన్నీ ఫొటోలు మాత్రమే కాకుండా.. ఈ లేజర్ షోలో పుష్ప సినిమాకు సంబంధించిన చిత్రాలను కూడా ప్రదర్శించారు.
ఈ షో గురువారం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు దాదాపు గంటన్నర పాటు సాగింది. అప్పటి వరకూ ఈ లేషోను బన్నీ ఆక్రమించాడు. ఇందుకోసం జీహెచ్ఎంసీకి ఫీజు కూడా చెల్లించారు. గంటన్నర సమయానికి 30 వేల రూపాయలు చెల్లించినట్టు సమాచారం. రూ.70 వేలు ముందస్తుగా డిపాజిట్ చెల్లించినట్టు కూడా తెలుస్తోంది.
టాలీవుడ్లో సినిమాలకు సంబంధించి ఈ తరహా ప్రచారం బహుశా ఇదే మొదటిది కావొచ్చు. ప్రచారంలోని ఈ కొత్తదనం అందరినీ ఆకర్షిస్తున్న నేపథ్యంలో మిగిలిన వారు కూడా ఈ పద్ధతిని ఫాలో అయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.