Movie Release: శ్యామ్​సింగరాయ్​కు పుష్ప భారీ ట్విస్ట్​.. ఇండస్ట్రీలో హాట్​టాపిక్​గా మారిన ఇష్యూ!

Movie Release: సహజమైన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించి న్యాచురల్ స్టార్ గా ఎదిగాడు నాని. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి వచ్చి హిట్లు, ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. కాగా, రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన శ్యామ్​సింగరాయ్ సినిమాతో మరోసారి పలకరించేందుకు నాని సిద్ధమయ్యారు. డిసెంబరు 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, నానికి ట్విట్​ ఇస్తూ.. అల్లు అర్జున్​ రెడీ అవుతున్నట్లు సమాచారం. సుకుమార్​ […]

Written By: Raghava Rao Gara, Updated On : November 13, 2021 2:35 pm
Follow us on

Movie Release: సహజమైన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించి న్యాచురల్ స్టార్ గా ఎదిగాడు నాని. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి వచ్చి హిట్లు, ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. కాగా, రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన శ్యామ్​సింగరాయ్ సినిమాతో మరోసారి పలకరించేందుకు నాని సిద్ధమయ్యారు. డిసెంబరు 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, నానికి ట్విట్​ ఇస్తూ.. అల్లు అర్జున్​ రెడీ అవుతున్నట్లు సమాచారం.

సుకుమార్​ దర్శకత్వంలో బన్నీ పుష్ప సినిమా తీస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రమోషన్స్​లో భాగంగా విడుదల చేసిన పోస్టర్​లు, పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కాగా, డిసెంబరు 17న విడుదలకు సిద్దమైంది సినిమా. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్​లో ఫుల్​ బిజీగా ఉన్నారు బన్ని. అయితే, ఈ మూవీని డిసెంబరు 25న విడుదల చేయాలని భావిస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్​ వినిపిస్తోంది.

వాస్తవానికి పుష్పను డిసెంబరు చివర్లో రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. కానీ, అల్లు అర్జున్​ ఫ్యాన్స్​ కోసం వారం ముందుగానే థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు దర్శకనిర్మాతలు. ఇప్పుడు రిలీజ్​ అప్​డేట్​పై మరోసారి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కారణం షూటింగ్ ఆలస్యం కావడమేనట. ఒకవేళ అదే నిజమైతే భారీ ఎక్స్​పెక్​టేషన్స్​తో విడుదలవుతున్న శ్యామ్​సింగరాయ్​కి, పుష్ప మధ్య భారీ పోటీ నెలకొన్నట్లే. అప్పుడు ఏ సినిమా సూపర్​ హిట్​గా నిలుస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. మరోవైపు, విభిన్న కథాంశంతో పిరియాడికల్​ నేపథ్యంలో శ్యామ్​సింగరాయ్​ తరకెక్కగా.. తనకెరీర్​లో ఎప్పుడూ చేయని కొత్త పాత్రలో బన్నీ కనిపించనున్నారు.