Director Teja- Pushpa: సంచలనాల దర్శకుడు తేజ. ఆయన తన సినిమాలతో ప్రేక్షకులను ఫిదా చేశాడు. జయం సినిమాతో దర్శకుడిగా మారి నితిన్ కెరీర్ లో మరుపురాని విజయాన్ని అందించాడు. తరువాత ఉదయ్ కిరణ్ తో నువ్వునేను సినిమా తెరకెక్కించి శభాష్ అనిపించుకున్నాడు. గోపిచంద్ ను విలన్ గా చూపించి బాగానే మార్కులు కొట్టేశాడు. దీంతో తేజ తీసిన సినిమాలు తక్కువే ఆయనకు క్రేజ్ బాగానే వచ్చింది. కానీ ఇప్పుడు తేజ పరిస్థితి ఎటు కదలడం లేదు. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో తనలో టాలెంట్ ఇంకా తగ్గలేదని నిరూపించుకున్నా తరువాత వచ్చిన సీత సినిమాతో మళ్లీ కథ మొదటికే వచ్చింది. తనలో ఇంకా ప్రతిభ ఉందని నిరూపించుకోవాలంటే మళ్లీ ఓ హిట్ సినిమా వస్తేనే సాధ్యమవుతుంది.

అలాంటి దర్శకుడు తేజ పుష్ప సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పుష్ప సినిమా ఉత్తరాదిలో బాగానే ఆడినా తెలుగులో మాత్రం ఆడలేదని చెబుతున్నాడు. దీంతో తేజ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పుష్ప ప్యాన్ ఇండియా మూవీ అని టాక్ తెచ్చుకున్నా తెలుగులో మాత్రం తగిన ఆదరణ దక్కలేదని చెప్పడం గమనార్హం. దీంతో పుష్ప 2కు కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. దీన్ని కూడా ప్యాన్ ఇండియా స్థాయిలో తడాఖా చూపించాలని దర్శకుడు సుకుమార్ నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయి. త్వరలో సినిమా పట్టాలెక్కనుంది.
పుష్పలో అల్లు అర్జున్ నటన హైలెట్. పాత్రలో జీవించాడు. స్మగ్లర్ గా నటించి అందరిని మెప్పించాడు. తెలంగాణలో టికెట్ల ధరల సమస్య లేకపోవడంతో ఇబ్బందులు లేకపోయినా ఆంధ్రలో మాత్రం టికెట్ల రేట్ల విషయంలో తేడాలు రావడంతో నష్టపోయినట్లు తేజ చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో తేజ ఇలా మాట్లాడటంతో అందరిలో విస్మయం వ్యక్తమవుతోంది. పుష్ప సినిమా గురించి ఇలా నెగెటివ్ టాక్ రావడం ఇదే తొలిసారి. దీంతో దర్శకుడు తేజ వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

పుష్ప కొత్త ట్రెండ్ సృష్టించింది. పుష్ప మేనియాతో తగ్గేదెలే అనే డైలాగ్ ఎంతో ప్రచారం అయింది. ఎర్ర చందనం అక్రమ రవాణా కథాంశంగా సుకుమార్ అద్భుతమైన కథను అల్లాడు. దీంతో అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ మారు హిట్ గా నిలిచింది. పుష్ప సృష్టించిన హంగామాతో కలెక్షన్లు కొల్లగొట్టింది. సుకుమార్ ప్రతిభ అందరికి తెలిసిందే. తనదైన శైలిలో సినిమాలు నిర్మించడం ఆయన ప్రత్యేకత. దర్శకుడు తేజ ఏ ఉద్దేశంతో అన్నాడో కానీ పుష్ప ఫెయిల్ అనే మాట ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ గా మారుతోంది.