Pushpa Record: ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప .. పుష్ప.. ఈ పేరు తప్ప ఇంకేం వినిపించడం లేదు. సుకుమార్ దర్శకత్వంలో స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సినిమా పుష్ప. డిసెంబరు 17న విడుదలైన ఈ సినిమా భారీ రెస్పాన్స్‌తో థియేటర్లలో సందడి చేస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగిన ఈ సినిమాను సుకుమార్ ఎంతో చాకచక్యంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మరోవైపు థియేటర్లలలోకి వచ్చిన తొలిరోజు మిశ్రమ స్పందన లభించినప్పటికీ.. కలెక్షన్ల పరంగా మాత్రం రికార్డుల మోతం మోగిస్తున్నారు పుష్పరాజ్. తాజాగా, ఈ సినిమా మరో రికార్డును సొంతం చేసుకుంది.
ఈ ఏడాది విడుదలైన చిత్రాలన్నింటిలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా పుష్ప రికార్డును నెలకొల్పింది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 3వేల థియేటర్లకు పైగా విడుదలైన ఈ సినిమా.. మొత్తంగా రూ. 71 కోట్ల గ్రాస్‌ను రాబట్టినట్లు నిర్మాతలు వెల్లడించారు. 2021లో తొలిరోజే ఈ రేంజ్ కలెక్షన్లు రాబట్టిన తొలి భారతీయ సినిమా పుష్పనే అని అంటున్నారు. మరోవైపు పుష్ప సినిమా కోసం భారీగా ఖర్చు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కోసం సుమారు 180కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం. అయితే, బడ్జెట్లో ఉన్న క్వాలిటీ.. సినిమాలో లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ విషయంలో సుకుమార్ ఎంత జాగ్రత్త వహిస్తారో అందరికి తెలిసిందే.
గతంలో ఆయన తెరకెక్కిన సినిమాలన్నీ హాలీవుడ్ ఇన్స్పిరేషన్తోనే తీసినట్లు పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఇప్పుడు పుష్పిలో ఆ మార్క్ ఎక్కడా? అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. కాగా, ఇందులో అనసూయ, సునీల్ మునుపెన్నడూ లేని విభిన్న పాత్రల్లో కనిపించారు. రావు రామేశ్ తో పాటు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా సంక్రాంతికి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం.