https://oktelugu.com/

Pushpa: ఫస్ట్​టైం పుష్పరాజ్​ లాంటి కొడుకుంటే బాగుండనిపించింది- కల్పలత

Pushpa: స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్​ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప.. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. పుష్పరాజ్​గా ఊరమాస్​ లుక్​లో కనిపించిన బన్నీ.. అదిరిపోయే నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. డిసెంబరు 17న ఈ సినిమా విడుదల కాగా.. రెండో రోజే 100 కోట్ల క్లబ్​లో చేరి.. రికార్డులు నెలకొల్పింది. ఇందులో నటించిన  సనీల్​, అనసూయ తదితరులు వాళ్ల వాళ్ల పాత్రల్లో ఇరగదీసేశారు. తొలిసారి తన కెరీర్​లో పాన్​ఇండియా స్థాయి సినిమాతో వచ్చి.. భాషతో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 23, 2021 / 02:21 PM IST
    Follow us on

    Pushpa: స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్​ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప.. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. పుష్పరాజ్​గా ఊరమాస్​ లుక్​లో కనిపించిన బన్నీ.. అదిరిపోయే నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. డిసెంబరు 17న ఈ సినిమా విడుదల కాగా.. రెండో రోజే 100 కోట్ల క్లబ్​లో చేరి.. రికార్డులు నెలకొల్పింది. ఇందులో నటించిన  సనీల్​, అనసూయ తదితరులు వాళ్ల వాళ్ల పాత్రల్లో ఇరగదీసేశారు. తొలిసారి తన కెరీర్​లో పాన్​ఇండియా స్థాయి సినిమాతో వచ్చి.. భాషతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో క్రేజ్ దక్కించుకున్నారు బన్నీ.

    అయితే, తాజాగా, ఈ సినిమాలో పష్పకు తల్లిగా నటించిన కల్పలత.. బన్నీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. పుష్ప షూటింగ్​ విషయాలను కూడా పంచుకుంది. బన్నీ షూటింగ్​లోకి అడుగుపెడితే.. వేరే విషయాలు పట్టించుకోడని.. తన పాత్రలో పూర్తిగా లీనమైపోతాడని చెప్పారు కల్పలత.

    అంతే కాదు, తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని… ప్రస్తుతం వారు అమెరికాలో ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు తనకు కొడుకులేడని ఎప్పుడూ అనిపించలేదని.. బన్నీని చూశాక.. తనకూ ఇలాంటి కొడుకు ఉంటే బాగుండని అనిపించని వివరించారు. పుష్ప సినిమా షూటింగ్ పూర్తయ్యాక.. అందరూ ఇంటికెళ్తుంటే.. బన్నీని వదిలి వెళ్లినప్పుడు సొంత కొడుక్కు దూరమైపోతున్న ఫీలింగ్ వచ్చిందని అన్నారు.  కాగా, ఈ సినిమాలో హీరోయిన్​గా రష్మిక నటించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఐటెం సాంగ్​లో హాట్ క్యూట్​ హీరోయిన్ సమంత కనిపించి అందర్నీ ఆకట్టుకుంది.