Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప ది రైజ్’ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ దిశగా దూసుకుపోతోంది. ఫస్ట్ టైం అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ పాన్ ఇండియన్ రేంజ్‌లో విడుదలైన విషయం తెలిసిందే. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన పుష్ప మూవీపై డివైడ్ టాక్ వస్తున్న కలెక్షన్ల పరంగా ‘తగ్గేదెలే’ అంటుంది. నైజాంలో పుష్ప ఫస్ట్ డే కలెక్షన్ ఏకంగా బాహుబలి రికార్డునే బ్రేక్ చేసిందంటే పుష్పరాజ్ (బన్నీ) ఏ విధంగా మాస్ పర్ఫామెన్స్ ఇచ్చాడో అర్థం చేసుకోవచ్చు.

టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి నైజాం మార్కెట్ చాలా కీలకం. మెగా హీరోలకు సైతం నైజాం మార్కెట్ కంచుకోటగా మారింది. మెగా ఫ్యామిలీ నుంచి ప్రతీ హీరో ఈ మార్కెట్ పై కన్నేస్తున్నాడంటే అర్థం చేసుకోవచ్చు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో ‘వరుణ్ తేజ్’ కూడా మొన్నటివరకు నైజాం మార్కెట్‌లో రచ్చ చేశాడు. మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలు టాక్‌తో సంబంధం లేకుండా ఇక్కడ నడుస్తుంటాయి. ఫుల్ రష్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల టాక్.
కాసుల వర్షం కురుస్తూనే ఉంటుంది. ఈ లాజిక్ ఇప్పుడు అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా విషయంలోనూ వర్కౌట్ అయ్యిందని చెప్పవచ్చు. ఫ్యాన్స్ టాక్‌తో సంబంధం లేకుండా నైజాంలో కాసుల వర్షం కురిపించారు. పుష్ప సినిమా తొలిరోజు నైజాంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. మొన్నటి వరకు బాహుబలి -2 పేరు మీదున్న రికార్డులను పుష్ప చెరిపేసింది. తొలి రోజే రూ. 11.44 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి పుష్ప మూవీతో బన్నీ సరికొత్త చరిత్రను తిరగరాశాడు. ఇప్పటి వరకు నైజాంలో తొలి రోజే భారీ కలెక్షన్లు సాధించిన సినిమాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read: Pushpa: ‘పుష్ప’ విమర్శల పై సుకుమార్ వివరణ !
అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప మూవీ తొలిరోజు నైజాంలో రూ.11.44 కోట్ల షేర్ వసూలు చేయగా.. ప్రభాస్ హీరోగా నటించిన సాహో మూవీ 9.41 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక బాహుబలి-2 మూవీ నైజాంలో తొలిరోజే 8.9 కోట్ల షేర్ సాధించింది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ మూవీ ఫస్ట్ డే నైజాం కలెక్షన్ రూ. 8.75 కోట్ల షేర్ రాబట్టింది. మహేశ్ బాబు హీరోగా చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమా తొలిరోజు రూ. 8.67 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. చిరంజీవి హీరోగా వచ్చిన సైరా నరసింహారెడ్డి నైజాంలో తొలిరోజు రూ. 8.10 కోట్ల షేర్ వసూలు చేసింది. మహేశ్ బాబు మహర్షి సినిమా 6.38 కోట్ల షేర్ రాబట్టగా.. బాహుబలి ది బిగినింగ్ 6.35 కోట్ల షేర్ వసూలు చేసింది.
Also Read: RRR: పుష్ప పరిస్థితి చూశాక, ఆర్ఆర్ఆర్ పై టెన్షన్ మొదలైంది !