https://oktelugu.com/

Pushpa 3: పుష్ప 3 అధికారికమే, టైటిల్ ఏమిటో తెలుసా? అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్

పుష్ప 3 ఉంటుందని చాలా కాలంగా ప్రచారం అవుతుంది. పుష్ప 2 ఆలస్యం కావడంతో పార్ట్ 3 పై సందిగ్ధత ఏర్పడింది. అయితే పుష్ప 3 కూడా రానుంది. టైటిల్ కూడా ఫిక్స్ అయ్యింది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం అందుతుంది. ఆ విశేషాలు ఏమిటో చూద్దాం..

Written By:
  • S Reddy
  • , Updated On : December 3, 2024 / 03:33 PM IST

    Pushpa 3

    Follow us on

    Pushpa 3: పుష్ప ప్రకటన సమయంలో దర్శకుడు సుకుమార్ కి రెండు భాగాలుగా చేయాలనే ఆలోచన లేదు. కానీ మైత్రీ మూవీ మేకర్స్ సీఈఓ చెర్రీ…. సలహా ఇచ్చాడట. ఈ విషయాన్ని పుష్ప 2 ప్రీ రిలీజ్ వేడుకలో సుకుమార్ స్వయంగా తెలియజేశాడు. పుష్ప 3 కావాలని ఫ్యాన్స్ గోల చేయడంతో అది మీ హీరో ఇష్టం. అల్లు అర్జున్ మరో మూడేళ్లు నాకు సమయం కేటాయిస్తాను అంటే పుష్ఫ 3 చేస్తానని ఆయన అన్నారు. ఈ క్రమంలో ఈ ప్రాజెక్ట్ పై అనుమానాలు ఏర్పడ్డాయి. పుష్ప 3 ఉండకపోవచ్చని ఫ్యాన్స్ భావించారు.

    అయితే హీరో విజయ్ దేవరకొండ 2022లో చేసిన సోషల్ మీడియా ట్వీట్… పుష్ప 3 పై స్పష్టత ఇచ్చింది. దర్శకుడు సుకుమార్ కి బర్త్ డే విషెస్ తెలియజేసిన విజయ్ దేవరకొండ 2021- ది రైజ్, 2022-ది రూల్, 2023- ది రాంపేజ్ అంటూ కామెంట్ చేశాడు. అలాగే మీతో వర్క్ చేయడానికి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నానని సదరు ట్వీట్ లో పెట్టాడు. మరోవైపు పుష్ప 2 చిత్రానికి రసూల్ పూకుట్టి పని చేస్తున్నారు. ఫైనల్ సౌండ్ మిక్సింగ్ ఫోటో షేర్ చేశా రు ఆయన. ఆ ఫోటో బ్యాక్ గ్రౌండ్ లో పుష్ప 3 పోస్టర్ ఉంది.

    అంటే పుష్ప 2 విడుదలకు ముందే పుష్ప 3 కన్ఫర్మ్ అయ్యింది. ఆలస్యమైనా కూడా పార్ట్ 3 వస్తుందనే నమ్మకం ఫ్యాన్స్ లో ఏర్పడింది. గతంలో సుకుమార్.. పుష్ప ఎండ్ లెస్ సబ్జెక్టు… ఎన్ని పార్టులు అయినా తీయవచ్చు అన్నారు. మొత్తంగా పుష్ప 2 విడుదలకు ముందు మరో అప్డేట్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి పిచ్చ కిక్ ఇచ్చింది.

    పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న విడుదల అవుతుంది. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. రూ 1000 కోట్ల వసూళ్లు సులభంగా రాబడుతుందని ట్రేడ్ వర్గాల అంచనా. ఇక పుష్ప 2 రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే పుష్ప 2 మూవీ టార్గెట్ రూ. 400 కోట్ల గ్రాస్. అంతరాబడితే కానీ హిట్ స్టేటస్ అందుకోదు.