https://oktelugu.com/

Pushpa 2 : ఆ దేశం లో ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టిన పుష్ప 2…ఇప్పటికీ నీయ్యవ్వ తగ్గేదెలే అంటున్నా పుష్పరాజ్…

అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో ప్రస్తుతం కెరియర్ లో టాప్ రేంజ్ లో దూసుకెళ్తున్నాడు. పర్సనల్ విషయాల్లో కొంతవరకు తను వివాదాలను ఎదుర్కొంటున్నప్పటికి అవేవీ పట్టించుకోకుండా పుష్ప 2 సినిమా భారీ రికార్డులను క్రియేట్ చేస్తూ ముందుకు సాగడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి...

Written By: , Updated On : December 28, 2024 / 08:08 AM IST
Pushpa 2

Pushpa 2

Follow us on

Pushpa 2 : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో సైతం తనదైన రీతిలో సినిమాలు చేయడమే కాకుండా ఆయనకంటూ ఒక భారీ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు… ఆయన చేసిన పుష్ప 2 సినిమా ఇండియా వైడ్ గా 1800 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టడమే కాకుండా బాహుబలి 2 సినిమా రికార్డును బ్రేక్ చేయడానికి సిద్ధమవుతుంది. అలాగే దంగల్ సినిమా రికార్డును కూడా బ్రేక్ చేసినట్లయితే ఇండియాలో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిన సినిమాగా ఈ సినిమా నిలుస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఇలాంటి క్రమంలోనే అల్లు అర్జున్ ఈ సినిమాతో భారీ విజయాన్ని దక్కించుకొని తన స్టామినా ఏంటో చూపించాడు. ఇక ప్రస్తుతం ఆయన కొన్ని వివాదాలను ఎదుర్కొంటున్నప్పటికి సినిమా పరంగా అయితే ఆయన చేసిన పుష్ప 2 సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని అల్లరించడమే కాకుండా ఆయనకంటూ ఒక స్టార్ డమ్ ను తీసుకొచ్చి పెట్టిందనే చెప్పాలి. మరి ఏది ఏమైనా కూడా పుష్ప సినిమా మొదటి పార్ట్ ఎంత సక్సెస్ అయిందో రెండో పార్ట్ అంతకుమించి సక్సెస్ ని సాధించడమే కాకుండా అల్లు అర్జున్ క్రేజ్ ను ఆకాశానికి ఎత్తేసిందనే చెప్పాలి .ఇక ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమా నేపాల్ లో భారీ విజయాన్ని సాధించి ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే…

కేవలం 20 రోజుల్లో 30 కోట్ల కలెక్షన్లు రాబట్టి అక్కడ ఇండస్ట్రీ హిట్ గా నిలిచినట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా నేపాల్ లాంటి దేశంలో కూడా అల్లు అర్జున్ తన హవాని కొనసాగిస్తున్నాడు అంటే మామూలు విషయమైతే కాదు…

ఒక దేశంలో సినిమా మరొక దేశంలో ఇండస్ట్రీ హిట్టు కొట్టడం అంటే నిజంగా అది చాలా అరుదైన రికార్డనే చెప్పాలి. ఇప్పటివరకు అలాంటి రికార్డుని ఎవరు క్రియేట్ చేయలేదు. అలాంటిది ఈ సినిమాతో అల్లు అర్జున్ అలాంటి ఒక కొత్త రికార్డును క్రియేట్ చేయడం అనేది నిజంగా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి చాలా గర్వకారణమనే చెప్పాలి.

మరి అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో ఇకమీదట చేయబోయే సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఆయనకు వరల్డ్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. కాబట్టి మంచి కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తేనే అవి సూపర్ సక్సెస్ అవుతాయి. లేకపోతే మాత్రం ఆయన క్రేజ్ అనేది భారీగా తగ్గిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి…