https://oktelugu.com/

Pushpa 2 : పుష్ప 2 టికెట్ రేట్స్ భారీగా పెంచారు…మరి మొదటి రోజు ఈ సినిమాకి ఎంత కలెక్షన్స్ రాబోతున్నాయి..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్న హీరోలు చాలామంది ఉన్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : December 4, 2024 / 09:28 AM IST

    Pushpa 2

    Follow us on

    Pushpa 2 : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్న హీరోలు చాలామంది ఉన్నారు. అందులో అల్లు అర్జున్ ఒకరు. ఈయన చేస్తున్న సినిమాలు ప్రేక్షకుల్లో మంచి అంచనాలను రెకెత్తించడమే కాకుండా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకున్నాడు. డాన్సుల్లోనూ, ఫైటుల్లోను, యాక్టింగ్ లోను తనకంటూ ఒక ట్రేడ్ మార్క్ ని క్రియేట్ చేసుకున్న ఆయన ఇప్పుడు పాన్ ఇండియా ప్రేక్షకులను షేక్ చేయడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది…

    అల్లు అర్జున్ లాంటి నటుడు పుష్ప 2 సినిమాతో భారీ రేంజ్ కి ఎదగాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఆయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధించాయి. ఇక పుష్ప మొదటి పార్ట్ బాలీవుడ్ లో భారీ సక్సెస్ ని సాధించడంతో ఆయనకి ఎక్కడలేని గుర్తింపైతే వచ్చింది. ఇక దాంతో పాటుగా ఆయనకు ‘నేషనల్ అవార్డు’ కూడా రావడం అనేది చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమాతో భారీ ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. అయితే డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా పట్ల ప్రేక్షకులందరు చాలా అంచనాలైతే పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా టికెట్ రేట్లను భారీగా పెంచడంతో కొంతమంది ప్రేక్షకులు మాత్రం అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి వీళ్ళు పెట్టిన భారీ బడ్జెట్ అనేది రికవరీ అవ్వాలంటే మొదట కొన్ని రోజులు టికెట్ రేట్ పెంచాల్సిన అవసరమైతే ఉంది. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్లు కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా మొదటి రోజే భారీ సక్సెస్ ని సాధించే దిశగా ముందుకు దూసుకెళ్ళబోతుందననే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

    ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా మొదటి రోజు 350 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబడుతుంది అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పటివరకు త్రిబుల్ ఆర్ సినిమా 250 కోట్లతో మొదటిరోజు అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా హిస్టరీని క్రియేట్ చేసింది. మరి పుష్ప 2 సినిమా ఆ రికార్డును బ్రేక్ చేస్తుందా? లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి.

    ఇక ఏది ఏమైనా పుష్ప 2 లాంటి భారీ బడ్జెట్ సినిమాని తెరకెక్కించడం అంటే మామూలు విషయం కాదు. మరి అంత బడ్జెట్ ని రికవరీ చేసుకోవాలంటే టికెట్ రేట్లు పెంచడంలో ఎంత మాత్రం తప్పు లేదని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు.

    ఇక ఈ సినిమా మొదటి రోజు కనుక 300 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టినట్లైతే అల్లు అర్జున్ కెరీర్ లోనే ది బెస్ట్ సినిమాకి నిలవడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ సరికొత్త రికార్డును కూడా క్రియేట్ చేసిన సినిమాగా గుర్తింపును సంపాదించుకుంటుంది… చూడాలి మరి ఈ సినిమా మొదటిరోజు ఎలాంటి కలెక్షన్స్ ని రాబడుతుంది అనేది…