Pushpa 2 : The Rule Song : పుష్ప 2 సాంగ్.. అడుక్కోండిరా బై.. రవితేజ సెటైర్లు…

ఇక ఆయన కామెడీగా అలా చేశాడా లేదా ఉద్దేశపూర్వకంగా చేశాడా అనేది తెలియాల్సి ఉంది. ఇక చాలామంది అయితే పబ్లిసిటీ కోసం సినిమా యూనిట్ అలాంటి వీడియో ఒకటి చేయించింది అని వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక ఏది ఏమైనప్పటికీ పుష్ప ఫస్ట్ సింగిల్ తో ప్రేక్షకులను మెప్పిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది...

Written By: NARESH, Updated On : April 24, 2024 10:41 pm

pushpa-2-first-song-from-allu-ar

Follow us on

Pushpa 2 : The Rule : ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఒక సినిమా గురించి తీవ్రమైన చర్చ జరుగుతుంది. అలాగే ఆ సినిమా మీద విపరీతమైన అంచనాలైతే ఏర్పడ్డాయి.అది ఏ సినిమా అంటే అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప 2.. ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో అంచనాలు మామూలుగా లేవు. ఇక 2021 వ సంవత్సరంలో వచ్చిన పుష్ప సినిమా ప్రేక్షకులందరిని మెప్పించిందనే చెప్పాలి.

ఇక సెలబ్రెటీలందరూ పుష్ప తగ్గేదేలే అనే డైలాగ్ ని రీల్స్ చేస్తూ అలాగే సినిమాలోని సాంగ్స్ ని షాట్స్ గా చేస్తూ ప్రేక్షకులందరిని ఎంటర్టైన్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా హాలీవుడ్ లో అంత పెద్ద సక్సెస్ అవుతుందని ఎవరు అనుకోలేదు. కానీ అందరూ ఊహలను తలదన్నుతూ సక్సెస్ అయింది. ఇక దాంతో పుష్ప 2 సినిమా మీద విపరీతమైన అంచనాలైతే నెలకొన్నాయి. అయితే ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ని కూడా రిలీజ్ చేశారు అది కూడా భారీ రెస్పాన్స్ ని అందుకుంది.

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేసే పనిలో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక అందుకు అనుగుణంగానే పుష్ప పుష్ప పుష్ప అనే సాంగ్ ప్రోమో ని రిలీజ్ చేశారు. ఫుల్ సాంగ్ ని మే ఒకటోవ తేదీన ఉదయం 11 గంటల 07 నిమిషాలకు సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నట్లుగా మేకర్స్ అఫీషియల్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఇక దీనికి రవితేజ సెటైరికల్ గా ఒక వీడియో చేశాడు. “పుష్ప పుష్ప అంటూ అడుక్కుంటారేంట్రా బీచ్ లోకి కెళ్ళి పల్లీలు అమ్ముకోండ్రా” అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి…

ఇక ఆయన కామెడీగా అలా చేశాడా లేదా ఉద్దేశపూర్వకంగా చేశాడా అనేది తెలియాల్సి ఉంది. ఇక చాలామంది అయితే పబ్లిసిటీ కోసం సినిమా యూనిట్ అలాంటి వీడియో ఒకటి చేయించింది అని వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక ఏది ఏమైనప్పటికీ పుష్ప ఫస్ట్ సింగిల్ తో ప్రేక్షకులను మెప్పిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది…