Homeఎంటర్టైన్మెంట్Pushpa 2 : పుష్ప 2 స్ట్రీమింగ్ పార్టనర్ ఫిక్స్.. ఎందులో ప్రసారం అవుతుందంటే ?

Pushpa 2 : పుష్ప 2 స్ట్రీమింగ్ పార్టనర్ ఫిక్స్.. ఎందులో ప్రసారం అవుతుందంటే ?

Pushpa 2 : ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం పుష్ప 2 ఫీవర్ నడుస్తోంది. మరికొన్ని గంటల్లో థియేటర్స్ లోకి రానుంది. ఇప్పటికే బెనిఫిట్ షోలో పడ్డాయి. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు చూడాలా అని అభిమానులు ఒక్కో నిమిషం లెక్కబెట్టుకుంటున్నారు. పుష్ప 2 డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ 12500 పైగా థియేటర్స్ లో ఆరు భాషల్లో పాన్ ఇండియా లెవల్లో విడుదలవుతుంది. 4వ తేదీ అర్ధరాత్రి నుండి పుష్ప 2 ప్రదర్శనలు ఉంటాయి. పుష్ప 2 ఇండియాలోనే అతిపెద్ద రిలీజ్ అని చెప్పొచ్చు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే ఓటీటీ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా ప్రసారం కానుంది. దేశంలోనే అతి పెద్ద సినిమా కాబట్టి ఇది మూడు లేదా నాలుగు నెలల తర్వాత స్ట్రీమింగుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటీవల హైదరాబాద్ వేదికగా ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. దీనికి భారీ రెస్పాన్స్ దక్కింది. ఈ ఈవెంటుకు రాజమౌళితో పాటు పలువురు చిత్ర ప్రముఖులు విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. అంతకు ముందు పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ముంబై, చెన్నై, కొచ్చిన్ నగరాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ జరిగాయి. ఆకాశమే హద్దుగా ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. కాగా పుష్ప 2కు సంబంధించిన టీజర్, ట్రైలర్, మేకింగ్ వీడియో, పాటలు భారీ రెస్పాన్స్ అందుకున్నాయి. ఈ చిత్రం కోసం సుకుమార్, అల్లు అర్జున్ తో పాటు చిత్ర యూనిట్ మూడేళ్ల పాటు కష్టపడింది. ఈ సినిమాలో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. సినిమా కోసం భారీ సెట్స్ నిర్మించారు.

దాదాపు రూ 500 కోట్ల బడ్జెట్ తో పుష్ప 2 తెరకెక్కిందని తెలుస్తోంది . మేకింగ్ వీడియోలో మనకు నిర్మాతలు పెట్టినటువంటి ప్రతి రూపాయి కనిపిస్తుంది. ఖర్చుకు వెనకాడకుండా నిర్మాతలు పుష్ప 2 చిత్రాన్ని తెరకెక్కించారు. యాక్షన్ ఎపిసోడ్స్ పుష్ప 2 లో ఊహకు మించి ఉంటాయనిపిస్తుంది. 2021లో వచ్చిన పుష్ప చిత్రానికి ఇది సీక్వెల్ కాగా .. ఏకంగా మూడేళ్లు సమయం పట్టింది. బెటర్ అవుట్ ఫుట్ కోసం సుకుమార్ సమయం తీసుకున్నారు. ఆగస్టులో విడుదల కావాల్సిన పుష్ప 2 డిసెంబర్ కి వాయిదా పడింది. ఓ వారం రోజుల క్రితం వరకు కూడా షూటింగ్ చేయడం విశేషం. ఈ సినిమాను చెప్పిన సమయానికి తెచ్చేందుకు సుకుమార్ టీమ్ చాలా కష్టపడ్డారు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. శ్రీలీల స్పెషల్ సాంగ్ చేసింది. ఫహాద్ ఫాజిల్, జగపతిబాబు, అనసూయ, సునీల్, రావు రమేష్ కీలక రోల్స్ చేస్తున్నారు. దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...

HYDRA Ranganath: హైడ్రా రంగనాథ్ కు రాం రాం.. తెలంగాణ హైకోర్టు సంచలనం

HYDRA Ranganath: హైడ్రా.. తెలంగాణలో 2023లో కొలువుదీరిన రేవంత్‌రెడ్డి సర్కార్‌ హైదరాబాద్‌లోని ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువులు, కుంటల ఆక్రమణల తొలగింపు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు సహాయ సహకారాలు అదించేందుకు ఏర్పాటు...

Kerala Innovation: అమ్మ కష్టం చూడలేక.. ఈ కొడుకు చేసిన పని.. ఏకంగా సీఎం చప్పట్లు కొట్టాడు..

Kerala Innovation: ఉదయం లేవగానే ఇల్లు ఊడ్చి.. కల్లాపి చల్లాలి. ముగ్గు పెట్టాలి. బట్టలు ఉతకాలి. టీ దగ్గర నుంచి మొదలు పెడితే కూర వరకు వండాలి. ఇంటిని శుభ్రం చేయాలి. ఇన్ని...

Arunachalam Moksha Margam: అరుణాచలం మోక్షమార్గం.. తెలుగు భక్తులకే ఎందుకీ కష్టాలు..

Arunachalam Moksha Margam: అప్పుడెప్పుడో ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు అరుణాచలంలో ప్రదక్షిణలు చేయాలని.. మోక్ష మార్గం నుంచి బయటికి రావాలని పిలుపునిచ్చారు. ఆయన చెప్పడమే ఆలస్యం తెలుగు భక్తులు అప్పటినుంచి...

Suryakumar Yadav: సూర్య కుమార్ యాదవ్.. నీ కష్టం పగ వాడికి కూడా రావద్దు బ్రో

Suryakumar Yadav:  అతడి నాయకత్వంలో టీమిండియా టి20 లలో ఒక్క ట్రోఫీ కూడా కోల్పోలేదు.. చివరికి టి20 వరల్డ్ కప్ కూడా సాధించింది. 2024లో రోహిత్ నాయకత్వంలో టీమిండియా అద్భుతం చేస్తే.. 2026లో...
Oktelugu Epaper
Exit mobile version