Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 : ది రూల్’ విడుదలకు నేటి నుండి సరిగ్గా 10 రోజుల సమయం ఉంది. సోషల్ మీడియా లో మాత్రమే కాకుండా, బయట కూడా ఎక్కడ చూసినా ‘పుష్ప 2’ మేనియా నే కనిపిస్తుంది. దానికి తోడు రీసెంట్ గా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ ఈ సినిమా మీద అంచనాలను ‘వైల్డ్ ఫైర్’ లాగా పెంచేసాయి. అదే విధంగా నిన్న విడుదల చేసిన ‘కిస్సిక్’ లిరికల్ వీడియో సాంగ్ ఈ సినిమా పై ఉన్న బజ్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లింది. ఇలా రోజురోజుకు అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఈ సినిమాకి పెరిగిపోతూ ఉన్నాయి. అందుకే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్, కేవలం ప్రీమియర్ షోస్ కి ఆల్ టైం రికార్డు ని నెలకొల్పే రేంజ్ లో ఉన్నాయి. నార్త్ అమెరికా లో ఈ చిత్రానికి ఇప్పటి వరకు ప్రీమియర్ షోస్ కి 14 లక్షల డాలర్లు వచ్చాయి.
ట్రెండ్ ని చూస్తూ ఉంటే, కేవలం ప్రీమియర్ షోస్ నుండి ఈ చిత్రానికి 3 మిలియన్ డాలర్లు వచ్చేలాగా అనిపిస్తుంది అంటూ ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. కేవలం నార్త్ అమెరికా లో మాత్రమే కాదు, మిగిలిన ఓవర్సీస్ ప్రాంతాల్లో కూడా ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ కళ్ళు చెదిరే రేంజ్ లో వస్తున్నాయి. ఉదాహరణకి మనకి నార్త్ అమెరికా తర్వాత ఓవర్సీస్ లో బిగ్గెస్ట్ మార్కెట్ ఆస్ట్రేలియా. ఈ ప్రాంతంలో ప్రీమియర్ షోస్ అయితే పడవు కావు, మొదటి రోజు వచ్చే వసూళ్లను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. అక్కడి ట్రేడ్ విశ్లేషకుల లెక్కల ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ 5 లక్షల డాలర్స్ కి పైగా జరిగిందని అంటున్నారు. 10 రోజులకు ముందే ఈ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ అంటే, మొదటి రోజు కచ్చితంగా ఈ చిత్రం ఆస్ట్రేలియా లో 1 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ ని రాబడుతుందని బలమైన నమ్మకంతో ఉన్నారు మేకర్స్.
అదే విధంగా యునైటెడ్ కింగ్డమ్, అరబ్ కంట్రీస్ లో కూడా ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ మునుపెన్నడూ లేని విధంగా జరుగుతున్నాయట. చూస్తుంటే కేవలం మొదటి రోజే ఈ చిత్రానికి ఓవర్సీస్ లో 7 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. అయితే ఓవర్సీస్ లో మన తెలుగు ఆడియన్స్ కంటే, హిందీ ఆడియన్స్ ఎక్కువ. హిందీ ఆడియన్స్ లో పుష్ప కి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. టాక్ వస్తే మొదటి రోజు ఓవర్సీస్ లో హిందీ వెర్షన్ వసూళ్లు కూడా వేరే లెవెల్ లో ఉంటాయి. అలా తెలుగు, హిందీ రెండు కలిసి వస్తే, ఈ చిత్రానికి కేవలం మొదటిరోజే ఓవర్సీస్ లో 10 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.