Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘పుష్ప 2’ చిత్రం విడుదలై నిన్నటితో రెండు వారాలు పూర్తి అయ్యింది. ఈ రెండు వారాలు ఈ సినిమా సృష్టించిన బాక్స్ ఆఫీస్ వండర్స్ ని చరిత్ర ఎప్పటికీ మర్చిపోలేదు. మొదటి రోజు నుండి నిన్నటి వరకు 30 కోట్ల రూపాయిల వరల్డ్ వైడ్ గ్రాస్ వసూళ్లకు తగ్గకుండా ఈ చిత్రం దూసుకుపోయిందంటే, ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు. వీకెండ్ తర్వాత థియేట్రికల్ రన్ అతి కష్టం అన్నట్టుగా ఉంటున్న ఈ ఓటీటీ యుగం లో ఒక సినిమా థియేటర్స్ నుండి ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం అనేది ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కి గోల్డెన్ డేస్ అని చెప్పొచ్చు. అయితే ఈ సినిమాకి హిందీ వెర్షన్ లో వస్తున్న వసూళ్లతో పోల్చి చూస్తే మిగిలిన వెర్షన్స్ లో వస్తున్న వసూళ్లు చాలా తక్కువ.
తెలుగు వెర్షన్ లో సూపర్ హిట్ రేంజ్ వసూళ్లు అయితే వచ్చాయి కానీ, ఇప్పటి వరకు బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోలేదు. విడుదలకు ముందు ఈ సినిమాకి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ తెలుగు రాష్ట్రాలకు 213 కోట్ల రూపాయలకు జరిగింది. నిన్నటి వరకు ఈ చిత్రానికి 197 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని క్లీన్ సూపర్ హిట్ స్టేటస్ కి చేరాలంటే మరో 16 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టాలి. ప్రాంతాల వారీగా కూడా ఈ సినిమాకి ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క ప్రాంతంలో కూడా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. ఈ క్రిస్మస్ కి బ్రేక్ మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక మిగిలిన రాష్ట్రాల విషయానికి వస్తే కర్ణాటక లో ఈ చిత్రానికి 32 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగితే రెండు వారాలకు 47 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక్కడ బయ్యర్స్ కి 15 కోట్లు లాభం.
అదే విధంగా తమిళనాడు ప్రాంతం వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే ఈ ప్రాంతంలో ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 52 కోట్ల రూపాయలకు జరిగితే, ఇప్పటి వరకు 31 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ ప్రాంతం లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం అసాధ్యం. కేరళలో అల్లు అర్జున్ కి మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ ప్రాంతం లో 20 కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే ఇప్పటి వరకు 7 కోట్ల రూపాయిలు మాత్రమే వచ్చింది. ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం అసాధ్యం. నార్త్ ఇండియా లో మాత్రం ఈ సినిమా బయ్యర్స్ కి లాభాల వర్షం కురిపించింది. 200 కోట్ల రూపాయలకు కొంటే, 300 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. అంటే వంద కోట్లు లాభం అన్నమాట. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ లెక్కలు చూస్తే రెండు వారాలకు కలిపి 1400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్, 680 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి.