Pushpa 2 OTT : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 ‘ చిత్రం గత నెలలో విడుదలై, ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా థియేట్రికల్ రన్ ని సొంతం చేసుకుంటుంది. సంక్రాంతి కానుకగా విడుదలైన కొన్ని కొత్త సినిమాలను సైతం ఈ చిత్రం డామినేట్ చేసిందంటే ఏ స్థాయి బ్లాక్ బస్టర్ హిట్ అనేది అర్థం చేసుకోవచ్చు. థియేట్రికల్ రన్ దాదాపుగా ముగిసింది అని అనుకునే సమయంలో మేకర్స్ 20 నిమిషాల అదనపు ఫుటేజీ ని జత చేస్తూ ‘పుష్ప 2 : రీ లోడెడ్’ వెర్షన్ తో మరోసారి ఆడియన్స్ ముందుకు వచ్చారు. రెస్పాన్స్ ఊహించిన దానికంటే అద్భుతంగా వచ్చింది. కొన్ని సన్నివేశాలు సెంటిమెంట్ ని పండించగా, కొన్ని సన్నివేశాలు వెండితెర పై బీభత్సమైన హీరోయిజం ని పండించాయి. అసలు ఇలాంటి బ్లాక్ బస్టర్ సన్నివేశాలను సినిమా నుండి ఎలా తొలగించాలని అనిపించింది అంటూ ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.
ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం ఓటీటీ విడుదల కోసం అభిమానులతో పాటు, ప్రేక్షకులు కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని అన్ని భాషలకు కలిపి 200 కోట్ల రూపాయిల ఫ్యాన్సీ రేట్ కి కొనుగోలు చేశారు. ఇంత రేట్ పెట్టి కొన్నారు కాబట్టి, ఈ చిత్రం థియేటర్స్ లో విడుదలైన కొద్దిరోజులకే ఓటీటీ లోకి వచేస్తాడని అనుకున్నారు. కానీ మేకర్స్ మాత్రం ఆ వార్తలను కొట్టిపారేస్తూ, ఈ చిత్రాన్ని 58 రోజుల తర్వాతే ఓటీటీ లోకి వస్తుందని ఖారారు చేసారు. ఇప్పటికి ఈ సినిమా విడుదలై 45 రోజులు పూర్తి అయ్యింది. ఓటీటీ లోకి రావాలంటే మరో రెండు వారాలు ఆగాల్సిందే. అయితే మేకర్స్ ఓటీటీ ఆడియన్స్ కోసం స్పెషల్ ట్రీట్ ని ప్లాన్ చేసారు.
రీసెంట్ గా జత చేసిన 20 నిమిషాల సన్నివేశాలతో పాటు, మరో 5 నిమిషాల అదనపు సన్నివేశాలను కూడా జత చేసి ఓటీటీ వెర్షన్ గా విడుదల చేయబోతున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే చేయనున్నారు మేకర్స్. థియేటర్స్ లో ఎన్నో అద్భుతాలను సృష్టించి, ఇప్పటికీ డీసెంట్ స్థాయి వసూళ్లతో దూసుకుపోతున్న ఈ సినిమా, ఓటీటీ ఆడియన్స్ ని కూడా అదే స్థాయిలో అలరిస్తుందని బలమైన నమ్మకం తో ఉన్నారు అభిమానులు . ఈమధ్య నెట్ ఫ్లిక్స్ లో విడుదలయ్యే సినిమాలకు వెస్ట్రన్ కంట్రీస్ కి సంబంధించిన ఆడియన్స్ ఎగబడి చూస్తున్నారు. #RRR చిత్రాన్ని ఎలా చూసారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన రీచ్ కారణంగానే ఆ సినిమా ఆస్కార్స్ వరకు వెళ్ళింది. ఇప్పుడు పుష్ప 2 కూడా అలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందని బలమైన నమ్మకం తో చెప్తున్నారు అభిమానులు.