AP Cabinet: ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణ లేనట్లే కనిపిస్తోంది. సీఎం జగన్ ఆ దిశగా ప్రయత్నాలేవీ చేయడం లేదు. దీంతో ఇన్నాళ్లు మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ఆశించిన వారికి నిరాశే ఎదురవుతోంది. ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావస్తున్నా కేబినెట్ విస్తరణపై జగన్ స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణ చేపట్టకపోవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మంత్రివర్గ విస్తరణ చేపడితే అనవసరంగా విభేదాలు వచ్చే అవకాశాలున్నందున విస్తరణ జోలికి పోయే సాహసం చేయడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
మరోవైపు ఆర్థిక పరిస్థితి కూడా అధ్వానంగా మారింది. సంక్షేమ పథకాల నిర్వహణకు అప్పులు చేయాల్సి వస్తోంది. దీంతో ఎన్నాళ్లు ఇలా అప్పులు తెచ్చి పెట్టేదనే అభిప్రాయానికి జగన్ వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోనే మంత్రివర్గ విస్తరణను వాయిదా వేస్తున్నారనే అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతోంది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవల సాయం చేయడం లేదు. దీంతో ప్రభుత్వ నిర్వహణ అడకత్తెరలో పోకచెక్కలా మారింది. దీంతో జగన్ మంత్రి వర్గ విస్తరణకు నో చెబుతున్నట్లు సమాచారం.
Also Read: సచిన్ రీ ఎంట్రీ.. సౌరవ్ గంగూలీ తన బ్యాచ్ నంతా బీసీసీఐలోకి ఎందుకు దింపుతున్నాడు?
అభివృద్ధి పనులు కూడా ఆమడదూరంలోనే ఉంటున్నాయి. రాష్ర్టంలో రోడ్ల సంగతి సరేసరి. దీంతో రాష్ర్ట పరిస్థితుల దృష్ట్యా మంత్రివర్గ విస్తరణ చేపట్టేందుకు సాహసం చేయడం లేదు. సంక్రాంతి తరువాత విస్తరణ ఉంటుందని భావించినా దానిపై జగన్ ఆలోచించడం లేదని చెబుతున్నారు. పైగా కొత్త మంత్రులు వస్తే రాష్ర్ట పరిస్థితి వారికి అర్థం కాక ఇబ్బందులు పడే సూచనలు ఉన్నాయనే ఆలోచనతో విస్తరణ ప్రయత్నాలు విరమించుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడున్న మంత్రివర్గంతోనే కాలం గడపాలని చూస్తున్నట్లు సమాచారం. వారికే అందలం వేయాలని చూస్తున్నట్లు చెబుతున్నారు.
మంత్రివర్గంలో ఒకరిద్దరిని మార్చాలని చూసినా విభేదాలు వస్తాయనే సాకుతోనే మనసు మార్చుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు మంత్రిపదవులపై ఆశలు పెంచుకున్న వారికి నిరాశే మిగలనుంది. మొదట్లో మళ్లీ విస్తరణ చేపడతామని హామీ ఇచ్చినా పరిస్థితుల ప్రభావంతో జగన్ ముందుకు వెళ్లడం లేదని తెలుస్తోంది. ఇక మంత్రివర్గ విస్తరణపై మాట ఎత్తకపోవడమే మంచిదనే అభిప్రాయం అందరిలో వస్తోంది.
Also Read: టార్గెట్ బీజేపీ.. సీఎం కేసీఆర్‌తో తేజస్వి యాదవ్ కీలక భేటీ.. జాతీయ రాజకీయాలపై ఫోకస్