Pushpa 2 Second Song: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఇంటిలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప 2 సినిమా మీద ప్రస్తుతం పాన్ ఇండియాలో భారీ అంచనాలైతే ఉన్నాయి. అయితే ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుందో తెలీదు గానీ ప్రస్తుతానికైతే ఈ సినిమా ఫీవర్ లోనే ప్రతి ఒక్క అభిమాని కూడా ఈ సినిమా కోసం విపరీతంగా ఎదురుచూస్తున్నాడు. ఇక ఆగస్టు 15వ తేదీన థియేటర్లోకి రానున్న ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలైతే ఉన్నాయి.
ఇక రీసెంట్ వచ్చిన టీజర్ ను చూస్తుంటే అల్లు అర్జున్ ఈ సినిమాలో తన నటవిశ్వరూపాన్ని చూపించబోతున్నాడనేది చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. ఇక ఇప్పటికే ఫస్ట్ సింగిల్ గా వచ్చినా సాంగ్ కూడా సినిమా మీద హైప్ ని పెంచేసింది. ఇక ఇప్పుడు ఒక మెలోడీ సాంగ్ తో మన ముందుకు రాబోతున్నట్టుగా కూడా అర్థమవుతుంది. అయితే పుష్ప సినిమాలో మెలోడీ సాంగ్ అంటే ‘శ్రీవల్లి ‘ పాట గుర్తు వస్తుంది. ఈ పాట ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో మనందరికీ తెలిసిందే.
ఇక ఈ సాంగ్ లో అల్లు అర్జున్ చేసిన హుక్ స్టెప్ అయితే ప్రపంచంలో ఉన్న చాలా మంది సెలబ్రిటీలు సైతం దాన్ని వేస్తూ ఆ వీడియో లు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఇక ఇప్పుడు పుష్ప 2 నుంచి మెలోడీ సాంగ్ వస్తుందంటే శ్రీవల్లి సాంగ్ ను మించి ఉంటుందా లేదా అనే విధంగానే అభిమానుల్లో అయితే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఈ సాంగ్ ని దేవి శ్రీ ప్రసాద్ ఏ రేంజ్ లో డిజైన్ చేశాడో అంటూ అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్లైతే చేస్తున్నారు.
నిజానికి దేవి మెలోడీ సాంగ్స్ కొట్టడం లో సిద్ధహస్తుడనే చెప్పాలి. ఇక ఇప్పటికి ఆయన ఇండస్ట్రీకి వచ్చి 25 సంవత్సరాలు కావస్తున్న నేపథ్యంలో దేవిశ్రీప్రసాద్ అల్లు అర్జున్ కి మాత్రం అదిరిపోయే మ్యూజిక్ ఇస్తాడనే టాక్ అయితే ఇండస్ట్రీ ఉంది .ఇక దానికి తగ్గట్టుగానే ఇంతకు ముందు వీళ్ళ కాంబో లో ఆర్య, అత్య 2, బన్నీ, డీజే, పుష్ప లాంటి సినిమాలతో ప్రూవ్ చేశాడు. ఇక పుష్ప 2 సినిమాతో కూడా మరోసారి ప్రూవ్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది…