https://oktelugu.com/

Pushpa 2 Producer : శ్రీతేజ్ కోసం ‘పుష్ప 2’ నిర్మాత సంచలన నిర్ణయం.. ఇలాంటి పని ఇప్పటి వరకు ఎవరూ చేసి ఉండరు!

నేడు 'పుష్ప 2 ' నిర్మాతలు కిమ్స్ హాస్పిటల్ లోని శ్రీ తేజ్ ని కలిసి, అతని ఆరోగ్య పరిస్థితిపై ఆరాలు తీశారు. అనంతరం వాళ్ళు శ్రీతేజ్ కోసం 50 లక్షల రూపాయిల చెక్ ని రేవతి భర్త కి అందజేశారు. ఈ సందర్భంగా నిర్మాత నవీన్ మాట్లాడుతూ 'జరిగింది చాలా దురదృష్టకరమైన సంఘటన.

Written By:
  • Vicky
  • , Updated On : December 23, 2024 / 06:44 PM IST

    Pushpa 2 Producer

    Follow us on

    Pushpa 2 Producer :  సంధ్య థియేటర్ తొక్కిసిలాట ఘటనలో మరణించిన రేవతి కుమారుడు శ్రీ తేజ్, ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుంటున్న సంగతి తెలిసిందే. హాస్పిటల్ లో చేర్చినప్పుడు అతని పరిస్థితి విషమంగానే ఉన్నింది కానీ, ఆ తర్వాత డాక్టర్స్ మెరుగైన వైద్యం అందించడంతో నెమ్మదిగా కోలుకుంటున్నాడు. ఇంతకు ముందుతో పోలిస్తే శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు చాలా వరకు మెరుగుపడింది. నిన్న మొన్నటి వరకు వెంటిలేటర్ మీద చికిత్స అందుకున్న శ్రీతేజ్, ఇప్పుడు వెంటిలేటర్ సహాయం లేకుండానే చికిత్స అందుకుంటున్నాడు. రెండు మూడు సార్లు కళ్ళు కూడా తెరిచాడని డాక్టర్లు అంటున్నారు కానీ, మనుషులను గుర్తు పట్టలేకపోతున్నాడట. అయితే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం శ్రీ తేజ్ వైద్యానికి అవసరమయ్యే ఖర్చులను భరిస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా అల్లు అర్జున్ కూడా ఒక ట్రస్టు ని ఏర్పాటు చేసి, శ్రీ తేజ్ పేరు మీద రెండు కోట్ల రూపాయిలు ఫిక్సెడ్ డిపాజిట్స్ చెయ్యడానికి ముందుకొచ్చాడు.

    ఇదంతా పక్కన పెడితే నేడు ‘పుష్ప 2 ‘ నిర్మాతలు కిమ్స్ హాస్పిటల్ లోని శ్రీ తేజ్ ని కలిసి, అతని ఆరోగ్య పరిస్థితిపై ఆరాలు తీశారు. అనంతరం వాళ్ళు శ్రీతేజ్ కోసం 50 లక్షల రూపాయిల చెక్ ని రేవతి భర్త కి అందజేశారు. ఈ సందర్భంగా నిర్మాత నవీన్ మాట్లాడుతూ ‘జరిగింది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈ విషయం తెలిసిన తర్వాత మేమంతా ఎంతో బాధ పడ్డాము. చనిపోయిన రేవతి గారిని తిరిగి తీసుకొని రాలేము. కానీ శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడేందుకు మా వంతుగా 50 లక్షల రూపాయిల చెక్ ని ఆ అబ్బాయి తండ్రి గారికి అందజేస్తున్నాము. భవిష్యత్తులో ఆ కుటుంబానికి ఏ కష్టమొచ్చినా అండగా ఉంటాము’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ‘పుష్ప 2’ నిర్మాతలు ఆర్ధికసాయం అందించే ముందే తెలుగు ఫిలిం ఛాంబర్ కూడా శ్రీ తేజ్ ని ఆదుకునేందుకు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.

    అయితే ఇప్పటి వరకు మెగా కుటుంబం నుండి ఒక్కరు కూడా శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ని తెలుసుకునేందుకు కిమ్స్ హాస్పిటల్ కి రాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మెగా ఫ్యామిలీ లో ఎవరూ ఇలాంటి విషయాలను పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా మెగాస్టార్ చిరంజీవి మాత్రం పట్టించుకుంటాడు. అలాంటి ఆయన కూడా సైలెంట్ గా ఉండడం అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సినీ ప్రముఖులెవ్వరూ కూడా శ్రీ తేజ్ ని కలవడం లేదు అనే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా హైలైట్ చేసినప్పటికీ, చిరంజీవి నుండి, ఆయన కుటుంబం నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. నిన్న అల్లు అర్జున్ ఇంటి పై జరిగిన దాడి గురించి కూడా మెగా ఫ్యామిలీ లో ఎవ్వరూ స్పందించలేదు. చూస్తుంటే ఒక్కసారిగా అల్లు అర్జున్ ఒంటరి వాడైపోయాడు అనిపిస్తుంది.