Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 : ది రూల్’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రోజుకో అద్భుతాన్ని సృష్టిస్తూ ముందుకి దూసుకుపోతుంది. ముఖ్యంగా తెలుగు వెర్షన్ వసూళ్ల కంటే, హిందీ వెర్షన్ వసూళ్లు ఎక్కువగా ఉన్నాయి. అక్కడి ఆడియన్స్ ఒక ఉద్యమం లాగా ఈ సినిమాకి కదిలి వెళ్తున్నారు. హిందీ లో కచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని ఊహించారు కానీ, ఈ స్థాయిలో సంచలనం సృష్టిస్తుందని మాత్రం ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఈ చిత్రంతో అల్లు అర్జున్ బాలీవుడ్ లో ఖాన్స్ స్థాయి ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ని దక్కించుకున్నాడు అని చెప్పొచ్చు. మొదటి వారం లో ఈ సినిమా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. షేర్ వసూళ్లు 505 కోట్ల రూపాయిల వరకు ఉంటుంది. ఈ షేర్ లో తెలుగు వెర్షన్ నుండి 162 కోట్ల రూపాయిలు ఉంటే, హిందీ వెర్షన్ 190 కోట్ల రూపాయిలు ఉంది.
తేడా ఏ రేంజ్ లో ఉందో మీరే చూడండి. ఇదంతా పక్కన పెడితే 8వ రోజు ఈ చిత్రానికి హిందీ వెర్షన్ లో వచ్చిన వసూళ్లను పోల్చి చూస్తే, తెలుగు వెర్షన్ వసూళ్లు పావు శాతం కూడా లేదు. హిందీ వెర్షన్ లో ఈ చిత్రానికి 8 వ రోజు 25 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు, 16 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. కానీ తెలుగు వెర్షన్ లో మాత్రం 8వ రోజు కేవలం నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. అంటే తెలుగు వెర్షన్ తో పోలిస్తే హిందీ వెర్షన్ నాలుగు రెట్లు ఎక్కువ వచ్చాయి అన్నమాట. దీనిని బట్టి ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద హిందీ వెర్షన్ ఏ రేంజ్ ర్యాంపేజ్ వేసిందో అర్థం చేసుకోవచ్చు. భవిష్యత్తులో ఇలాంటి బ్లాక్ బస్టర్ రన్ అల్లు అర్జున్ కి కూడా కష్టమే.
ఇండియా లో కనీసం ఈ చిత్రం హిందీ వెర్షన్ లో నాల్గవ వంతు అయినా ఉంది, ఓవర్సీస్ లో అయితే 8వ రోజు హిందీ వెర్షన్ కి తెలుగు వెర్షన్ వసూళ్లు దరిదాపుల్లో కూడా లేదు. నార్త్ అమెరికా నుండి 8వ రోజు 2 లక్షల 50 వేల డాలర్లు వస్తే. అందులో తెలుగు వెర్షన్ కేవలం 30 వేల డాలర్లు మాత్రమే ఉంది. ఇప్పటి వరకు తెలుగు వెర్షన్ కి 6.6 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు రాగా, హిందీ వెర్షన్ లో 4.3 మిలియన్ డాలర్స్ వచ్చింది. ఓవరాల్ గా 11 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ వీకెండ్ తో ఈ చిత్రం #RRR రికార్డు ని దాటబోతుంది. ఓవరాల్ గా ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 8 వ రోజు 42 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 21 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.