https://oktelugu.com/

Pushpa 2: ‘పుష్ప 2 ‘ ఖాతాలో మరో సంచలన రికార్డు..ఇకపై అల్లు అర్జున్ రాజమౌళి ని మించిన బిగ్గెస్ట్ బ్రాండ్ !

అల్ టైం ఇండియన్ ఇండస్ట్రీ హిట్ గా నిల్చిందని పోస్టర్ ని విడుదల చేసారు. ఈ సందర్భంగా మేకర్స్ పోస్టర్ కి హ్యాష్ ట్యాగ్ ని జత చేస్తూ 'ఆల్ టైం ఇండియన్ ఇండస్ట్రీ హిట్ పుష్ప 2 ' వేసిన ట్వీట్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయ్యింది.

Written By:
  • Dharma
  • , Updated On : January 6, 2025 / 06:15 PM IST

    Pushpa 2 Collection(5)

    Follow us on

    Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ చిత్రం విడుదలై 32 రోజులు పూర్తి అయ్యింది. ఈ 32 రోజుల్లో ఈ సినిమా సాధించినన్ని రికార్డులు భవిష్యత్తులో మరో సినిమా అందుకుంటుందో లేదో తెలియదు కానీ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్రాండ్ ప్రస్తుతానికి రాజమౌళి ని మించిన బిగ్గెస్ట్ బ్రాండ్ అని నేటితో రుజువు అయ్యింది. కాసేపటి క్రితమే ఆ చిత్ర నిర్మాతలు ఒక పోస్టర్ ని విడుదల చేస్తూ, పుష్ప 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 1831 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని, బాహుబలి 2 లైఫ్ టైం వసూళ్లు 1810 కోట్ల రూపాయిల గ్రాస్ ని అధిగమించి, అల్ టైం ఇండియన్ ఇండస్ట్రీ హిట్ గా నిల్చిందని పోస్టర్ ని విడుదల చేసారు. ఈ సందర్భంగా మేకర్స్ పోస్టర్ కి హ్యాష్ ట్యాగ్ ని జత చేస్తూ ‘ఆల్ టైం ఇండియన్ ఇండస్ట్రీ హిట్ పుష్ప 2 ‘ వేసిన ట్వీట్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయ్యింది.

    అంతే కాదు రీసెంట్ గానే ఈ సినిమా బాలీవుడ్ లో 800 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టిన ఏకైక బాలీవుడ్ సినిమాగా ఈ ‘పుష్ప 2 ‘ మరో సంచలన రికార్డుని నమోదు చేసింది. ఇప్పటి వరకు అక్కడ 700 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిన సినిమానే లేదు, అలాంటిది బాలీవుడ్ కి ఏకంగా 800 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిన సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈపాటికి ఈ చిత్రం ఓటీటీ లో విడుదలై టాప్ 10 లో ట్రెండ్ అవుతూ ఉండేది. అలాంటిది 32 రోజులు దాటినప్పటికీ కూడా ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో గంటకు 5 నుండి 10 వేల టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ చిత్రం ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది.

    ‘గేమ్ చేంజర్’ చిత్రం మరో నాలుగు రోజుల్లో థియేటర్స్ లోకి రాబోతుంది. ఆ సినిమా వచ్చినప్పటికీ కూడా ఈ చిత్రానికి థియేట్రికల్ రన్ కొనసాగే లాగ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి థియేట్రికల్ రన్ దాదాపుగా ఆగిపోయినట్టే కానీ, హిందీ ఆడియన్స్ మాత్రం ఇప్పట్లో ఈ చిత్రాన్ని వదిలేలా లేరు. ‘గేమ్ చేంజర్’ కి మంచి సూపర్ హిట్ టాక్ వస్తేనే ఈ సినిమా వసూళ్ల జోరుకి అడ్డుకట్ట పడుతుంది. లేకపోతే ఈ సంక్రాంతికి కూడా బాలీవుడ్ ఆడియన్స్ కి ‘ పుష్ప 2 ‘ ఒక్కటే ఛాయస్ గా ఉండగలదు. బాలీవుడ్ లో ఒక సినిమా క్లిక్ అవ్వడం చాలా కష్టం, కానీ క్లిక్ అయితే మాత్రం వేరే లెవెల్ థియేట్రికల్ రన్ ఉంటుంది అనడానికి మరో ఉదాహరణ ‘పుష్ప 2 ‘. భవిష్యత్తులో ఈ చిత్రాన్ని మ్యాచ్ చేయగలిగే సినిమా ఏంటో చూడాలి.