Pushpa 2 Collection: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 ‘ చిత్రం విడుదలై 29 రోజులు పూర్తి అయ్యింది. ఈ 29 రోజులు ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రాబట్టిన వసూళ్లు, భవిష్యత్తులో ఏ హీరో కి కూడా సాధ్యం కాదేమో అనిపిస్తుంది. ముఖ్యంగా ఖాన్స్ త్రయం అల్లు అర్జున్ క్రియేట్ చేసిన ఈ వసూళ్ల సునామీ చూసి అసూయ పడుతూ ఉండుంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే వాళ్ళకి కూడా ఇలాంటి రికార్డ్స్ ఇప్పట్లో సాధ్యం కాదు. వాళ్ళ కెరీర్ లో ఏదైనా క్రేజీ మూవీ సీక్వెల్ చేస్తే తప్ప, ప్రస్తుతానికి పుష్ప 2 ని కొట్టడం కష్టమే. ఇదంతా పక్కన పెడితే ఇప్పటికీ ఆడియన్స్ అధిక శాతం పుష్ప 2 చిత్రానికే థియేటర్స్ లో చూసేందుకు మొదటి ఛాయస్ గా పెట్టుకున్నారు. గడిచిన 24 గంటల్లో ఈ సినిమాకి 65 వేలకు పైగా టికెట్స్ బుక్ మై షో యాప్ లో అమ్ముడుపోయాయి.
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ ఛిట్ర్టానికి తెలుగు రాష్ట్రాల్లో 29 వ రోజు 60 లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. అదే విధంగా హిందీ వెర్షన్ లో 8 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టగా, నిన్నటితో ఈ చిత్రం బాహుబలి 2 ఫుల్ రన్ గ్రాస్ ని దాటిందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ప్రపంచవ్యాప్తంగా ‘పుష్ప 2’ కి నిన్న 11 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, ఓవరాల్ గా 1811 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. బాహుబలి 2 చిత్రానికి అప్పట్లో 1809 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. సుమారుగా 7 ఏళ్ళ నుండి చెక్కు చెదరకుండా పదిలంగా ఉన్న ఈ రికార్డు ని ‘పుష్ప 2’ అలవోకగా అందుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
వసూళ్ల పరంగా ‘పుష్ప 2’ చిత్రం ‘బాహుబలి 2’ ని దాటేసింది కానీ, టికెట్స్ సేల్స్ విషయం లో మాత్రం దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయింది. పుష్ప 2 కి ఇప్పటి వరకు కేవలం 6 కోట్ల టికెట్స్ సేల్ అయ్యాయి. అన్ని సినిమాలకంటే అత్యధిక టిక్కెట్లు అమ్ముడుపోయిన సినిమాగా పాత చిత్రం షోలే నిల్చింది. ఈ సినిమాకి దాదాపుగా 18 కోట్ల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఆ రేంజ్ లో ఇప్పుడు ఒక సినిమాకి టికెట్స్ అమ్ముడుపోతే 6 వేల కోట్ల రూపాయలకు పైగానే గ్రాస్ ఉంటుంది. మరి ఆ రేంజ్ సునామీ ని సృష్టించే హీరో ఎవరో చూడాలి. ప్రస్తుతానికి మహేష్, రాజమౌళి కాంబినేషన్ చిత్రానికి మాత్రమే ఆ స్థాయి వసూళ్లను రాబట్టేంత సత్తా ఉంది. ఎందుకంటే ఇది కేవలం పాన్ ఇండియన్ సినిమా మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ సినిమా. మొదటి రోజే 500 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ఉంటుందని మహేష్ అభిమానులు ఇప్పటి నుండే లెక్కలు వేయడం మొదలు పెట్టారు.