https://oktelugu.com/

Pushpa 2: బెటర్ అవుట్ ఫుట్ కోసం పుష్ప 2 మేకర్స్ సంచలన నిర్ణయం.. అసలు ఏం జరిగిందంటే?

పుష్ప 2 ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. ఫస్ట్ కాపీ సిద్ధం చేశారు. సెన్సార్ కూడా పూర్తి అయ్యింది. విడుదలకు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉంది. బెటర్ అవుట్ ఫుట్ కోసం పుష్ప 2 దర్శక నిర్మాతలు ఓ నిర్ణయం తీసుకున్నారు అనేది సోషల్ మీడియా టాక్.

Written By:
  • S Reddy
  • , Updated On : November 28, 2024 / 01:34 PM IST

    Pushpa 2(13)

    Follow us on

    Pushpa 2: పుష్ప చిత్రానికి నాలుగు రెట్లు ఎక్కువ బడ్జెట్ తో పుష్ప 2 తెరకెక్కుతుంది. దర్శకుడు సుకుమార్.. పార్ట్ 2 మరింత గొప్పగా ఉండాలని చాలా కసరత్తు చేశాడు. ఈ క్రమంలో కొంచెం ఆలస్యమైంది. రెండు రోజుల క్రితం షూటింగ్ పూర్తి కావడం విశేషం. ఈ క్రమంలో అల్లు అర్జున్, రష్మిక మందాన ఎమోషనల్ అయ్యారు. ఇది ఐదేళ్ల జర్నీ, అంటూ పుష్ప జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు.

    కాగా పుష్ప 2 చిత్రానికి బీజీఎమ్ కోసం థమన్ ని తీసుకున్నారని తెలిసింది. ఈ విషయాన్ని నిర్మాతలు కూడా పరోక్షంగా ఒప్పుకున్నారు. థమన్ బీజీఎమ్ స్పెషలిస్ట్. గతంలో చాలా సినిమాలకు ఆయన స్వరపరిచిన నేపధ్య సంగీతం విజయంలో కీలకం అయ్యింది. పుష్ప 2వంటి పాన్ ఇండియా చిత్రానికి థమన్ సహకారం తీసుకోవడం మంచిది అని నిర్మాతలు భావించారట. తాజాగా మరో వార్త తెరపైకి వచ్చింది. థమన్ రూపొందించిన బీజీఎమ్ ని పుష్ప టీమ్ సినిమాకు వాడటం లేదట. బెటర్ క్వాలిటీ కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

    సోషల్ మీడియాలో ఈ మేరకు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. పుష్ప 2 చిత్రానికి దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. పార్ట్ 1కి కూడా ఆయనే పని చేశాడు. బీజీఎమ్ సంగతి ఎలా ఉన్నా.. సాంగ్స్ అదిరిపోయాయి. ప్రతి పాట వైరల్ అయ్యింది. సామీ సామీ, శ్రీవల్లి, ఊ అంటావా మామా.. సాంగ్స్ సోషల్ మీడియాను దున్నేశాయి. నార్త్ లో కూడా ఈ సాంగ్స్ విశేష ఆదరణ పొందాయి. పుష్ప 2 చిత్రానికి సైతం దేవిశ్రీ ఇచ్చిన సాంగ్స్ మెప్పించాయి.

    ఇక డిసెంబర్ 5న పుష్ప 2 విడుదల కానుంది. ఫస్ట్ కాపీ చూసిన అల్లు అరవింద్ మూవీ అద్భుతం అన్నారట. సెన్సార్ సభ్యులు యూ /ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. సెన్సార్ సభ్యులు సైతం మూవీకి పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చారని సమాచారం. పుష్ప 2 ఓపెనింగ్స్ ఓ రేంజ్ లో ఉండనున్నాయనేది అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే అర్థం అవుతుంది. యూఎస్ లో ఈ మూవీ ఫాస్టెస్ట్ వన్ మిలియన్ ప్రీమియర్ వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. మైత్రీ మూవీ మేకర్స్ రూ. 400 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఈ చిత్రానికి అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ రూ. 300 కోట్లు అంటున్నారు.