Pushpa 2 Collections : ఐకాన్ స్టార్ నటించిన ‘పుష్ప 2’ చిత్రం విడుదల రోజు నుండి నేటి వరకు మన టాలీవుడ్ ని వసూళ్ల పరంగా మరో మెట్టు పైకి ఎక్కించే దిశగా ముందుకు దూసుకుపోతుంది. తెలుగు లో ఈ సినిమాకి భారీ వసూళ్లు వస్తాయని ఊహించిందే. కానీ హిందీ లో ఈ చిత్రం ఆల్ టైం రికార్డు గ్రాస్ సాధించే దిశగా అడుగులు వేస్తుందని మాత్రం ఎవ్వరూ ఊహించలేకపోయారు. అసలు ఇంత వసూళ్లు ఎలా సాధ్యమని ట్రేడ్ పండితులు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి. తెలుగులో ఈ చిత్రం మొదటి రోజు ఆల్ టైం రికార్డుని సాధించలేకపోయింది కానీ, హిందీ లో మాత్రం ఆల్ టైం రికార్డుని నెలకొల్పి సంచలనం సృష్టించింది. అదే విధంగా ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం రెండవ రోజు, మూడవ రోజు తెలుగు వెర్షన్ వసూళ్లను డామినేట్ చేయడం అక్కడి ట్రేడ్ పండితులను కూడా ఆశ్చర్యానికి గురయ్యేలా చేసింది.
ఇదే ట్రెండ్ కొనసాగితే ఫుల్ రన్ లో హిందీ వెర్షన్ వసూళ్లు, తెలుగు వెర్షన్ వసూళ్ల కంటే భారీ లీడింగ్ తీసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. బాలీవుడ్ ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ చిత్రానికి అక్కడ మూడవ రోజు 70 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయట. మొదటి రోజు 72 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు రాగా, రెండవ రోజు 70 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు రావడం అనేది సాధారణమైన విషయం కాదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే రెండవ రోజు తో పోలిస్తే భారీ తేడా ఏమి లేదు కానీ, 35 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చిందని అంటున్నారు. అలా నార్త్ ఇండియా లో 90 కోట్ల రూపాయల గ్రాస్, తెలుగు రాష్ట్రాల్లో 35 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను మూడవ రోజు రాబట్టిన ఈ సినిమా కర్ణాటక లో 13 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిందని అంటున్నారు ట్రేడ్ పండితులు.
ఓవరాల్ గా ఓవర్సీస్ వసూళ్లతో కలిపి మూడవ రోజు 162 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది అంటున్నారు ట్రేడ్ పండితులు. ఓవర్సీస్ లోని నార్త్ అమెరికా లో ఈ చిత్రానికి మూడవ రోజు ఏకంగా 2.2 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఓవరాల్ ఓవర్సీస్ లో మూడవ రోజు 3 మిలియన్ డాలర్స్ కి పైగా గ్రాస్ వచ్చిందని అంచనా వేస్తున్నారు. అంటే మన ఇండియన్ కరెన్సీ లెక్కల్లో 20 కోట్ల రూపాయిల పైమాటే. ఇంతటి వసూళ్లు కేవలం ఇది వరకు రాజమౌళి సినిమాకి మాత్రమే రావడం మనమంతా చూసాము. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాకి వస్తుంది. ఇదే ఊపు కొనసాగితే ఓవర్సీస్ లో ఈ సినిమా సాధించే వసూళ్లను అందుకోవడం రాజమౌళి కి కూడా కష్టమే అని చెప్పొచ్చు.