Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 : రూల్’ మరో నాలుగు రోజుల్లో అన్ని ప్రాంతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. సుమారుగా మూడేళ్ళ నుండి అల్లు అర్జున్ అభిమానులు ఈ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసారు. ‘పుష్ప’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ అవ్వడంతో ఇతర హీరోల అభిమానుల్లో కూడా ఈ సినిమాని చూసేందుకు అదే స్థాయి ఆత్రుత ఉండేది. అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పుడెప్పుడు మొదలు అవ్వుద్దా అని ఎదురు చూసిన అభిమానులు, ప్రేక్షకులకు ఒక శుభవార్త. కాసేపటి క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన హిందీ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. తెలుగు ఆడియన్స్ కంటే హిందీ ఆడియన్స్ ఈ సినిమా కోసం ఒక రేంజ్ లో ఎదురు చూస్తున్నారు అనడానికి బుక్ మై షో లో అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ ఒక ఉదాహరణ.
గంటకు 8 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. పూర్తి స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ బాలీవుడ్ లో ఇంకా ప్రారంభం కాలేదు. కేవలం కొన్ని చోట్ల మాత్రమే ప్రారంబించారు. దానికే గంటకు 8 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయంటే, ఇక పూర్తి స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ ని బాలీవుడ్ లో మొదలు పెడితే ఏ రేంజ్ లో ఉంటుందో మీరే ఊహించుకోండి. కేవలం ఒక్క బాలీవుడ్ లో మాత్రమే కాదు, టాలీవుడ్, కోలీవుడ్. మాలీవుడ్ లో కూడా ఈ సినిమాకి ఇదే స్థాయి క్రేజ్ ఉంది. అన్ని భాషల్లోనూ పూర్తి స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ నేడు రాత్రి నుండి బుక్ మై షో లో ప్రారంభం అవ్వబోతుందట. ట్రేడ్ అంచనా ప్రకారం ఈ సినిమాకి బుక్ మై షోలో ఎదో ఒక సందర్భంలో గంటకు లక్ష టిక్కెట్లు అమ్ముడుపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. ఇప్పటి వరకు ఒక సినిమాకి ఈ స్థాయి ట్రెండ్ ఎప్పుడూ రాలేదు.
ప్రభాస్ ‘కల్కి’ చిత్రానికి గంటకు 90 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఇదే ఇప్పటి వరకు హైయెస్ట్ రికార్డు. దీనిని ‘పుష్ప 2’ చిత్రం బ్రేక్ చేస్తుందని బలమైన నమ్మకంతో ఉన్నారు నిర్మాతలు. ఇక తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో ఒక అంచనా వచ్చేసింది. తెలంగాణ ప్రభుత్వం టికెట్స్ పెంపు కొరకు అనుమతిని ఇస్తూ జీవో ని జారీ చేసింది. డిసెంబర్ నాల్గవ తేదీన రాత్రి 9 గంటల 30 నిమిషాల షోస్ కి, అర్థరాత్రి 1 గంట షోస్ కి అనుమతిని ఇచ్చింది. సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ లకు 800 రూపాయిలు, డిసెంబర్ 5 నుండి 8 వరకు సింగిల్ స్క్రీన్స్ కి 150 రూపాయిల వరకు పెంచుకోవచ్చని, మల్టీ ప్లెక్స్ కి 200 రూపాయిల వరకు పెంచుకోవచ్చని అనుమతిని ఇచ్చింది. డిసెంబర్ 9 నుండి 16 వరకు సింగల్ స్క్రీన్స్ 105 రూపాయిలు, మల్టీ ప్లెక్స్ 150 రూపాయలకు పెంచుకోవచ్చని చెప్పింది. ఇక ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి టికెట్ రేట్స్ కి అనుమతి రావాల్సి ఉంది.