Pushpa 2: షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘పుష్ప 2’..మూవీ టీం నుండి సెన్సేషనల్ అప్డేట్!

సుమారుగా ఏడాదిన్నర పాటు ఒక ప్రత్యేకమైన టీం ని ఏర్పాటు చేసుకొని కథని సిద్ధం చేసాడు. స్క్రిప్ట్ కోసం ఎంత శ్రద్ద పెట్టాడో, షూటింగ్ కోసం కూడా అదే స్థాయి శ్రద్ద చూపించాడు. ప్రతీ సన్నివేశానికి రెండు మూడు వెర్షన్లు షూట్ చేసి బెస్ట్ అనిపించినవి తీసుకున్నాడు.

Written By: Vicky, Updated On : October 17, 2024 2:20 pm

Pushpa 2(2)

Follow us on

Pushpa 2: కోట్లాది మంది అభిమానులు, ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2 : ది రూల్’ చిత్రం ఎట్టకేలకు నిన్నటితో టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది. ఇటీవలే ఫస్ట్ హాఫ్ ని ఎడిటింగ్, రీ రికార్డింగ్ తో సహా పూర్తి అయ్యిందని చెప్పుకొచ్చిన మూవీ టీం, ఇప్పుడు సెకండ్ హాఫ్ చిత్రీకరణ కూడా పూర్తి చేసారు. కేవలం ఐటెం సాంగ్ షూటింగ్ ఒక్కటే బ్యాలన్స్ ఉందట, ఈ వారం లోనే ఆ షూటింగ్ కూడా పూర్తి చేసి, నవంబర్ రెండవ వారం లోపు మొదటి కాపీ ని సిద్ధం చేస్తారట. డిసెంబర్ 6 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్టు కాసేపటి క్రితమే అల్లు అర్జున్ అధికారిక ప్రకటన చేసాడు. పుష్ప సినిమా భారీ బ్లాక్ బస్టర్ అవ్వడం తో, పుష్ప 2 స్క్రిప్ట్ కోసం సుకుమార్ కొత్తగా ఉండేందుకు చాలా కష్టపడ్డాడు.

సుమారుగా ఏడాదిన్నర పాటు ఒక ప్రత్యేకమైన టీం ని ఏర్పాటు చేసుకొని కథని సిద్ధం చేసాడు. స్క్రిప్ట్ కోసం ఎంత శ్రద్ద పెట్టాడో, షూటింగ్ కోసం కూడా అదే స్థాయి శ్రద్ద చూపించాడు. ప్రతీ సన్నివేశానికి రెండు మూడు వెర్షన్లు షూట్ చేసి బెస్ట్ అనిపించినవి తీసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ ప్రారంభం లో పర్వాలేదు అనే రేంజ్ లో ఉంటుందట, కానీ ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు ఆడియన్స్ కి వేరే లెవెల్ గూస్ బంప్స్ ని రప్పించే విధంగా స్క్రీన్ ప్లే ని సిద్ధం చేసాడట. ముఖ్యంగా ఫహాద్ ఫాజిల్, అల్లు అర్జున్ మధ్య వచ్చే సన్నివేశాలు వేరే లెవెల్ లో ఉంటాయని టాక్. ఈమధ్య పాన్ ఇండియన్ సినిమాల్లో కేవలం రెండు మూడు బ్లాక్స్ కరెక్ట్ గా పడితే చాలు, కళ్ళు చెదిరే వసూళ్లు వస్తున్నాయి. అలాంటిది పుష్ప 2 లో సినిమా మొత్తం అలాంటి హై ఇచ్చే బ్లాక్స్ ఉంటాయట. ఇది ఇలా ఉండగా టీజర్ లో అల్లు అర్జున్ చీర కట్టుకొని, విలన్స్ ని రఫ్ఫాడించే ఫైట్ సన్నివేశానికి సంబంధించిన షాట్స్ ని మీరంతా చూసే ఉంటారు.

ఆ సన్నివేశం మొత్తం వేరే లెవెల్ లో వచ్చిందట. అలాగే దేవి శ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి మరో పాజిటివ్ అని అంటున్నారు. సెకండ్ హాఫ్ లో హెలికాప్టర్ చేసింగ్ ఎపిసోడ్, ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు సుకుమార్ టేకింగ్ కి గూస్ బంప్స్ రావడం పక్కా అని అంటున్నారు. టాలీవుడ్ ఆడియన్స్ కంటే ఎక్కువగా ఈ సినిమా కోసం బాలీవుడ్ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. పుష్ప చిత్రం సృష్టించిన ప్రభంజనం అలాంటిది మరి. డిసెంబర్ 6వ తేదీ కంటే ముందే ఈ చిత్రానికి డిసెంబర్ 5న ప్రీమియర్ షోస్ వేయడానికి పెద్దఎత్తున ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.