Pushpa 2 Sandhya theatre incident: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని శాసించే స్థాయికి ఎదుగుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే మన హీరోలు సైతం వల్ల సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం లో మనవాళ్ళు చాలా వరకు ముందు వరుస లో ఉన్నారు…ఇక ఇదిలా ఉంటే మన స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే చాలు దానికి ప్రీమియర్ షోస్ బెనిఫిట్ షోస్ వేస్తూనే ఉంటారు…ఇక అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో వేసినప్పుడు సంధ్య థియేటర్ లో రేవతి అనే మహిళ తొక్కిసలాట లో మృతి చెందిన విషయం మనకు తెలిసిందే…ఇక దాంతో కొద్దిరోజుల పాటు ప్రీమియర్ షోస్ కి అనుమతి ఇవ్వలేదు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘హరిహర వీరమల్లు’ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాకి ప్రీమియర్ షోస్ వేసిన క్రమంలో కొంతమంది చిన్నపిల్లలతో థియేటర్ కి వచ్చారు. దాంతో పోలీసులు చిన్న పిల్లలతో వచ్చిన వాళ్లను ఇంటికి పంపించారు. అయితే థియేటర్ దగ్గర ఏదైనా ప్రమాదం జరగవచ్చు అనే ఉద్దేశ్యంతో ముందుగానే పోలీసులు వాళ్ళను ఇంటికి పంపించారు.
Also Read: తమిళ రాజకీయాలను షేక్ చేసే నిర్ణయం తీసుకున్న ధనుష్…
ఇక ఏది ఏమైనా కూడా ఇది చూసిన కొంతమంది నెటిజన్లు పోలీసులు మంచి పని చేశారు. ఒకవేళ పిల్లలు లోపలికి వెళ్తే ఏదైనా జరగకూడని తొక్కిసలాట జరిగితే చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి.
కాబట్టి వాళ్లు అలా చేయడంలో తప్పేమీ లేదని పోలీసులకు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు…ఇక హరిహర వీరమల్లు సినిమాకి ఓపెనింగ్స్ కూడా బాగానే వస్తున్నాయి అంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలు వస్తున్నాయి…
ఇక ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంత వసూళ్లను రాబడుతోంది అనేది తెలియాల్సి ఉంది… ఇక ఇప్పటి వరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా ఆ సినిమాలు సూపర్ సక్సెస్ అవ్వాలంటే కంటెంట్ అనేది సూపర్ గా ఉండాలి. అలా ఉన్నప్పుడే సినిమా సక్సెస్ అవుతుంది…