Fahadh Faasil Pushpa 2 Controversy: ‘పుష్ప'(Pushpa Movie) సిరీస్ ద్వారా అల్లు అర్జున్(Icon star Allu Arjun) కి నేషనల్ లెవెల్ లో ఎంత మంచి క్రేజ్ వచ్చిందో, ఆ చిత్రం లో నెగిటివ్ క్యారక్టర్ చేసిన ఫహాద్ ఫాజిల్(Fahaad Fazil) కి కూడా అంతే మంచి క్రేజ్ వచ్చింది. సినిమాటిక్ లిబర్టీ కోసం ఫహద్ ఫాజిల్ క్యారక్టర్ నెగిటివ్ అని అంటున్నాం కానీ , వాస్తవానికి ఈ సినిమాలో అల్లు అర్జున్ క్యారక్టర్ కూడా నెగటివ్. వీళ్లిద్దరి మధ్య జరిగే ఈగో క్లాష్ నే సినిమా. పుష్ప పార్ట్ 1 లో ఫహాద్ ఫాజిల్ చివరి 20 నిమిషాల్లో మాత్రమే కనిపిస్తాడు. కనిపించింది చాలా తక్కువసేపు అయినప్పటికీ కూడా, సినిమా మొత్తం పై చాలా బలమైన ఇంప్యాక్ట్ క్రియేట్ చేసాడు. ఇక సెకండ్ పార్ట్ లో ఆయన క్యారక్టర్ హీరో తో సరిసమానంగా అద్భుతంగా ఉంటుందని, నువ్వా నేనా అనే రేంజ్ పోటీ ని వాళ్ళిద్దరి మధ్య చూడొచ్చని అంతా అనుకున్నారు.
Also Read: ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్ పవన్ కళ్యాణ్ క్రేజీ లుక్ అదిరింది!
పార్ట్ 2 లో దాదాపుగా అలాగే చూపించారు కానీ, చివర్లో ఫహాద్ ఫాజిల్ ని కమెడియన్ ని చేసేశారంటూ ఈ సినిమా విడుదలైన కొత్తల్లో నెటిజెన్స్ తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫహద్ ఫాజిల్ అద్భుతమైన నటుడు, అతన్ని ఇలాంటి కామెడీ రోల్స్ కి ఉపయోగించుకుంటారా?, డైరెక్టర్ సుకుమార్ కి అసలు ఏమైంది అంటూ అప్పట్లో నెగటివ్ కామెంట్స్ చాలానే వచ్చాయి. అదే విధంగా ఈ చిత్రం లోని కొన్ని సన్నివేశాలకు ఫహద్ ఫాజిల్ అభిమానులు నొచ్చుకున్నారు. దీంతో మలయాళం వెర్షన్ ని పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ ని చేశారు. అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఫహద్ ఫాజిల్ ఒక సినిమాని ఉద్దేశించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. ఆయన మాట్లాడుతూ ‘గత ఏడాది ఒక సినిమా ని ఒప్పుకొని చేసి చాలా పెద్ద తప్పు చేసాను. నా అభిమానులను ఎంటర్టైన్ చేయడంలో నేను విఫలం అయ్యాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
Also Read: రాజా సాబ్ నుండి వణుకుపుట్టించే పోస్టర్ విడుదల..ఏమి ప్లాన్ చేశారు సామీ!
సినిమా పేరు డైరెక్ట్ గా చెప్పలేదు కానీ, ఆయన మాట్లాడిన మాటలను బట్టీ చూస్తుంటే ‘పుష్ప 2 ‘ గురించే చెప్తున్నట్టుగా అనిపించింది. కానీ అల్లు అర్జున్ అభిమానులు మాత్రం దీనిని ఒప్పుకోవడం లేదు. ఫహద్ ఫాజిల్ అంటే ఎవరో కూడా మాకు ఇంతకు ముందు తెలియదు. కేవలం ‘పుష్ప 2’ చిత్రం ద్వారా నే ఆయనకు పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ వచ్చింది. ఇప్పుడు తెలుగు లో కూడా ఆయన హీరో గా సినిమాలు చేస్తున్నాడు. తనకు ఇంత ఉపయోగపడిన సినిమా గురించి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, బహుశా ఆయన పుష్ప గురించి మాట్లాడలేదు అనుకుంట, గత ఏడాది ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్ ‘వెట్టియాన్’ లో కూడా నటించాడు. అందులో కూడా కమెడియన్ తరహా పాత్రలోనే కనిపిస్తాడు ఫహద్ ఫాజిల్, బహుశా ఆయన ఆ పాత్ర గురించే మాట్లాడి ఉండొచ్చు అంటూ సోషల్ మీడియా లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.