https://oktelugu.com/

Pushpa 2 : పుష్ప 2 మూవీకి తమన్ ఇచ్చిన బ్యా గ్రౌండ్ స్కోర్ కూడా నచ్చలేదా.?మరి ఇప్పుడు ఎవరు బరిలోకి దిగుతున్నారు..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎనలేని సేవలను అందిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న హీరో అల్లు అర్జున్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించి పెట్టుకోవడమే కాకుండా ఆయన చేసే సినిమాల మీద చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తూ తన అభిమానులను అలరించే విధంగా సినిమాలు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు...

Written By:
  • Gopi
  • , Updated On : November 30, 2024 / 02:23 PM IST

    Pushpa 2

    Follow us on

    Pushpa 2 : తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ లాంటి నటుడు మరొకరు ఉండరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు మంచి గుర్తింపు ను సంపాదించుకోవడమే కాకుండా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెడుతున్నాయి. ముఖ్యంగా పుష్ప 2 సినిమాతో ఆయన తనలోని నటన ప్రతిభను బయటకు తీస్తూ యావత్ ఇండియన్ సినిమా అభిమానులందరిని అలరించే విధంగా ముందుకు దూసుకెళుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆయన లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మన అదృష్టమనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా డిసెంబర్ 5 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా విషయంలో అల్లు అర్జున్ గాని సుకుమార్ గానీ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ మరి ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా విషయంలో వాళ్ళు చాలా కేర్ ఫుల్ గా ముందుకు సాగుతున్నారు.

    ఇక ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ తో బ్యాగ్రౌండ్ స్కోర్ ని కొట్టించిన సుకుమార్ అది పెద్దగా నచ్చకపోవడంతో తమన్ తో మరోసారి రీ రికార్డింగ్ చేయించాడు. ఇక ఈయన ఇచ్చిన బిజిఎం కూడా పెద్దగా నచ్చకపోవడంతో ఇప్పుడు శ్యామ్ సియస్, అంజనీష్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ తో బిజిఎం ని కొట్టిస్తున్నట్టుగా తెలుస్తోంది.

    ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా మీద వచ్చే హైప్ ని తట్టుకొని ఈ సినిమా నిలబడాలంటే క్వాలిటీ విషయం లో అసలు కాంప్రమైజ్ అవ్వద్దనే ఉద్దేశ్యంతోనే చాలా రిచ్ గా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా ఈ సినిమా విషయంలో ప్రతి ప్రేక్షకుడుని అన్ని విధాలుగా తీర్చి దిద్దినట్టుగా కూడా సుకుమార్ పలు సందర్భాల్లో తెలియజేయడం విశేషం…

    ఇక మొత్తానికైతే ఈ సినిమాతో సక్సెస్ ని సాధిస్తే అటు సుకుమార్, ఇటు అల్లు అర్జున్ ఇద్దరు పాన్ ఇండియాలో స్టార్లుగా వెలుగుతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక పుష్ప సినిమాతో నేషనల్ అవార్డును అందుకున్న అల్లు అర్జున్ ఈ సినిమాతో అంతకుమించి తన నటన ప్రతిభను చూపించే విధంగా ప్రణాళికలు చేసుకున్నాడు…ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే…