https://oktelugu.com/

Devi Sri Prasad : దేవి శ్రీ ప్రసాద్ నుంచి దూరంగా వెళ్తున్న దర్శకులు…కారణం ఏంటి..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు మంచి ఆల్బమ్స్ ని ఇస్తూ సినిమా సక్సెస్ లో కీలకపాత్ర వహిస్తూ వస్తున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : November 30, 2024 / 02:30 PM IST

    Devi Sri Prasad

    Follow us on

    Devi Sri Prasad : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు మంచి ఆల్బమ్స్ ని ఇస్తూ సినిమా సక్సెస్ లో కీలకపాత్ర వహిస్తూ వస్తున్నారు. ఇక ఇలాంటి సందర్భంలోనే దేవిశ్రీప్రసాద్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా తక్కువ సమయంలోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదగడమే కాకుండా క్వాలిటీ మ్యూజిక్ ని ఇస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు…

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది దర్శకులు వాళ్ళ సినిమాలను సూపర్ సక్సెస్ గా నిలపడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఒక్కో దర్శకుడు ఒక్కోసారి వాళ్ళకంటు ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఏది ఏమైనా కూడా ఒక సినిమా సక్సెస్ లో మ్యూజిక్ అనేది చాలా కీలక పాత్ర వహిస్తూ ఉంటుంది. మరి ఇలాంటి సందర్భంలో మ్యూజిక్ డైరెక్టర్ ను తీసుకునేటప్పుడు దర్శకుడు ఒకటికి పది సార్లు ఆలోచించి మరి తీసుకుంటాడనే విషయం మనందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లలో దేవిశ్రీప్రసాద్ ఒకరు. ఒకప్పుడు ఈయన ఇచ్చిన మ్యూజిక్ ప్రేక్షకులను అలరించడమే కాకుండా సినిమా సక్సెస్ లో కూడా కీలకపాత్ర వహిస్తూ వచ్చాయి. ఇక పుష్ప సినిమాతో కూడా ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించిన ఆయన ఆ తర్వాత నుంచి వచ్చిన సినిమాలతో పెద్దగా మ్యాజిక్ అయితే చేయలేకపోతున్నాడు. కారణం ఏదైనా కూడా ఆయన మ్యూజిక్ లో క్వాలిటీ అయితే తగ్గిందనే చెప్పాలి…ఇక ఇలాంటి సందర్భంలోనే ఆయన ప్రస్తుతం పుష్ప 2 సినిమా మ్యూజిక్ ని అందించినప్పటికి బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో సుకుమార్ వేరే మ్యూజిక్ డైరెక్టర్ ను తీసుకోవడం పట్ల పలు రకాల అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి.

    ఇక దేవిశ్రీప్రసాద్ అంత మంచి మ్యూజిక్ ఇవ్వకపోవడంతోనే ఆయన వేరే మ్యూజిక్ డైరెక్టర్ ను తీసుకున్నాడనే విధంగా సినిమా ఇండస్ట్రీలో ఒక న్యూస్ అయితే ఎక్కువగా వినిపిస్తుంది. మరి ఇలాంటి సందర్భంలో సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ దేవిని పక్కన పెట్టడం పట్ల చాలామంది అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు.

    ఈ దెబ్బ తో దేవి ని దాదాపు 5 సినిమాల నుంచి తప్పించినట్టుగా తెలుస్తోంది. దానివల్ల దేవి కెరియర్ మీద చాలావరకు ఇంపాక్ట్ అయితే పడుతుంది. కాబట్టి సుకుమార్ తీసుకున్న డిసిజన్ కూడా రాంగ్ అంటూ కొంతమంది అయితే వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా దేవిశ్రీప్రసాద్ ఇక మీదట తనను తాను ప్రూవ్ చేసుకుంటే తప్ప మళ్ళీ అతనికి భారీ అవకాశాలైతే వచ్చే ఛాన్సులు లేవు…

    ఇక ప్రస్తుతం తమన్ తన మ్యూజిక్ తో మ్యాజిక్ ను చేస్తూ ముందు దూసుకెళ్తున్నాడు. తన మ్యూజిక్ కాపీ అనే విమర్శలు వస్తున్నప్పటికి ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తున్నందువల్ల ఆయన ఇప్పటివరకు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కంటిన్యూ అవుతున్నారనే చెప్పాలి…