Puri Jagannath : హీరోయిజం కి సరికొత్త నిర్వచనం తెలిపిన దర్శకులలో ఒకరు పూరి జగన్నాథ్(Puri Jagannath). పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘బద్రి’ సినిమాతో ఆయన ప్రయాణం మొదలైంది. ఆరోజుల్లో బద్రిలోని పవన్ కళ్యాణ్ హీరోయిజం ని చూసి యూత్ ఆడియన్స్ మెంటలెక్కిపోయారు, వాళ్లకు ఆ హీరోయిజం చాలా కొత్తగా అనిపించింది. ఆ తర్వాత సినిమా సినిమాకు తన టేకింగ్ స్కిల్స్, డైలాగ్ రైటింగ్ పదును పెంచుకుంటూ ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, పోకిరి, దేశముదురు, చిరుత, బిజినెస్ మ్యాన్, టెంపర్, ఇస్మార్ట్ శంకర్ ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను మన టాలీవుడ్ ఆడియన్స్ కి అందించాడు. ఆయన ఫ్లాప్ సినిమాలు సైతం చూసేందుకు బాగానే అనిపిస్తాయి. కానీ ఎందుకో ఈమధ్య ఆయన పూర్తిగా ట్రాక్ తప్పాడు. ఒకప్పుడు మనం చూసిన పూరిజగన్నాథ్ యేనా లైగర్, డబల్ ఇస్మార్ట్ వంటి దారుణమైన సినిమాలు తీసింది అని ఆయన అభిమానులు కన్నీళ్లు పెట్టుకున్నారు.
Also Read : ఆటోఫజీ కి అర్ధం చెప్పిన పూరి..? ఉపవాసం ఉండటం వల్ల బాడీ లో ఎలాంటి మార్పులు వస్తాయి…
అయితే డబల్ ఇస్మార్ట్ దెబ్బకు పూరి జగన్నాథ్ ఇక దర్శకత్వం మానేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) తో ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ గత కొద్దిరోజుల నుండి వార్తలు వినిపించాయి. ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటంటే, రీసెంట్ గానే ఆయన తమిళ స్టార్ హీరోలలో ఒకరైన విజయ్ సేతుపతి(Vijay Sethupathi) ని కలిసి ఒక స్టోరీ ని వినిపించాడని, అది ఆయనకు చాలా బాగా నచ్చిందని, వెంటనే ఈ చిత్రం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు టైటిల్ ‘బెగ్గర్’ అట. అంటే ‘బిచ్చగాడు’ అని అర్థం. పూరి జగన్నాథ్ సినిమాని ఇప్పుడు సీరియస్ గా పట్టించుకునే ఆడియన్స్ లేరు కానీ, విజయ్ సేతుపతి ఈ ప్రాజెక్ట్ ని ఒప్పుకున్నాడంటే, కచ్చితంగా ఈ సినిమాలో ఎదో విశేషం ఉన్నట్టే అని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎందుకంటే విజయ్ సేతుపతి అంత తేలికగా ఒక సినిమాకి అంగీకరించడు. చాలా సెలెక్టివ్ గా ఆయన స్క్రిప్ట్స్ ని ఎంపిక చేసుకుంటాడు. అలాంటి వ్యక్తి పూరి స్క్రిప్ట్ ని ఓకే చేసాడంటే కచ్చితంగా బాగుంటుంది అనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు నెటిజెన్స్. పూరి జగన్నాథ్ కి ఇది చాలా ప్రెస్టీజియస్ అనే చెప్పాలి. ఈ సినిమా హిట్ కాకుంటే ఇక ఆయనతో కొత్తగా ఇండస్ట్రీ లోకి వచ్చిన హీరో హీరోయిన్లు కూడా ఇక పూరి జగన్నాథ్ తో సినిమాలు చేయడం కష్టం. ‘గాడ్ ఫాదర్’ చిత్రం పూరి ఒక కీలక పాత్ర పోషించాడు. ఇక దర్శకత్వం మానేసి అలాంటి పాత్రలు చేసుకోవడం బెటర్ అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ సెటైర్స్ వేస్తున్నారు. చూడాలి మరి ఈ ప్రాజెక్ట్ తో ఆయన కం బ్యాక్ అవుతాడా లేదా అనేది.
Also Read : చేసే ప్రతి పనిని ఎంజాయ్ చేయండి అంటున్న పూరి జగన్నాధ్…