Puri Jagannath : తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్… ఆయన డైరెక్షన్ లో వచ్చిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో పెను సంచలనాలను సృష్టించాయి. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని చాలా గొప్ప స్థాయిలో నిలబెట్టాయనే చెప్పాలి. అయితే గత కొన్ని రోజుల నుంచి ఆయన వరుస ప్లాప్ లను మూటగట్టుకుంటున్నాడు. మరి దీనివల్ల ఆయన పేరు అయితే బాగా చెడిపోయింది. మరి ఇప్పుడు మరోసారి విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ని హీరోగా పెట్టి తమదైన రీతిలో ‘ బెగ్గర్’ (Beggar) అనే సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా టైటిల్ కూడా చాలా కొత్తగా ఉండడంతో ప్రేక్షకులు ఈసారి పూరి జగన్నాధ్ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు అంటూ కొంతవరకు ఆనందపడుతున్నారు. మరి మరోసారి పూరీ జగన్నాధ్ సక్సెస్ ను సాధించి తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలంటే మాత్రం ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాల్సిన అవసరమైతే ఉంది. ఇక పూరి జగన్నాథ్ తన ఎంటైర్ కెరియర్ లో చేసిన సినిమాల్లో మహేష్ బాబు(Mahesh Babu)తో చేసిన పోకిరి(Pokir), బిజినెస్ మేన్ (Bussiness Man) సినిమాలు ఆల్ టైం హిట్స్ గా నిలిచిపోయాయి.
ఇక పోకిరి సినిమా విషయాన్ని పక్కన పెడితే బిజినెస్ మేన్ సినిమా మాత్రం మహేష్ బాబు కోసమే చేశానని పూరి జగన్నాధ్ గతంలో కొన్ని సందర్భాల్లో తెలియజేశాడు. అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ రెండు సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించాయి. ఇక బిజినెస్ మేన్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో మహేష్ బాబు వన్ మ్యాన్ షో చేశాడు. ఈ సినిమా మొత్తం ఒక్కడే కనిపిస్తూ ప్రతి మాటను ఒక డైలాగ్ లా పేల్చుతూ ఉంటాడు.
Also Read : పూరి జగన్నాథ్ గత సినిమాలతో సంబంధం లేదు : విజయ్ సేతుపతి…
ఇక వీళ్ళ కాంబినేషన్లో మూడో సినిమా కూడా వస్తుంది అని అందరూ అనుకున్నప్పటికి మహేష్ బాబు- పూరి జగన్నాధ్ (Puri Jagannadh)కి మధ్య కొన్ని విభేదాలు రావడంతో మూడో సినిమా రాకుండానే పోయింది. బిజినెస్ మేన్ సినిమా కథ రాసుకున్నప్పుడే అది మహేష్ బాబు తో చేయాలనే ఉద్దేశ్యంతో పూరి జగన్నాధ్ కథ అయితే రెడీ చేసుకున్నాడట.
ఇక మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా డైలాగులను రాసుకొని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడంతో మహేష్ బాబుకు ఎనలేని గుర్తింపు అయితే వచ్చింది. మరి ఈ కాంబినేషన్లో మరో సినిమా వచ్చుంటే బాగుండేదని అభిమానులు సైతం తెలియజేస్తున్నారు….