Puri Jagannath : తెలుగు సినిమా ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ కి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. ఆయన చేసిన సినిమాలన్ని ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ప్రేక్షకుడిని మెప్పించడమే కాకుండా తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడంలో కూడా చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అయితే ఉంది. ఒకప్పుడు ఆయన సినిమాకోసం ప్రేక్షకులందరు ఆసక్తిగా ఎదురుచూసేవారు. కానీ ఈ మధ్యకాలంలో వరుసగా భారీ డిజాస్టర్లను మూటగట్టుకుంటున్న ఆయన ప్రస్తుతం ఒక భారీ సక్సెస్ ని సాధించాల్సిన అవసరమైతే ఉంది. ఇక దానికి అనుగుణంగానే ఇప్పుడు భారీ సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యాడు. ఇక ఈ సినిమాని కల్ట్ క్లాసిక్ మూవీ గా నిలపాలనే ఉద్దేశ్యంతో ఆయన ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకోసమే ఆయన చేస్తున్న ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందంటూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని తమ వైపు తిప్పుకుంటున్న స్టార్ హీరోలందరూ వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటున్న సందర్భంలో పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతితో సినిమాని అనౌన్స్ చేసి నిజంగా స్టార్ హీరోలు అందరికీ షాక్ ఇచ్చాడనే చెప్పాలి. ఎందుకంటే పూరి జగన్నాథ్ కి ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో ఏ స్టార్ హీరో కూడా అవకాశాలు ఇచ్చే ఛాన్స్ లైతే లేవు. ఎందుకంటే ఆయన ఇప్పటికే చేసిన లైగర్(Liger), డబుల్ ఇస్మార్ట్ (Double Ismart) రెండు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ల ను అందించడంతో ఆయనకంటూ ఒక మార్కెట్ అయితే లేకుండా పోయింది.
Also Read : పూరి జగన్నాథ్ గత సినిమాలతో సంబంధం లేదు : విజయ్ సేతుపతి…
నిజానికి పాన్ ఇండియాలో ఆయనకు గొప్ప గుర్తింపు ఉన్నప్పటికి ఆయనతో సినిమా చేస్తే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. తద్వారా డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు భారీగా నష్టపోతున్నారనే ఒక రూమర్ అయితే ఇండస్ట్రీ మొత్తం స్ప్రెడ్ అయింది.
అందువల్ల ఆయనకు అవకాశాలను ఇచ్చే స్టార్ హీరోలు దొరకడం లేదు కాబట్టి ఆయన కొంతమంది మీడియం రేంజ్ హీరోలతో సినిమాలను చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక అందులో భాగంగానే విజయ్ సేతుపతితో సినిమా కమిట్ అవ్వడం అనేది నిజంగా అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
మరి ఈ సినిమాతో అయినా తను కంబ్యాక్ ఇస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. మరి మొత్తానికైతే ఈ సినిమాని ఒక క్లాసికల్ మూవీగా తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతో పూరి జగన్నాధ్ ఉన్నాడట. మొదటిసారి తనను తాను మారకొని మరి కొత్తగా తీయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతి తో ఆ జానర్ లో సినిమా చేస్తున్నాడా..?