https://oktelugu.com/

Puri Jagannadh : పూరీ జగన్నాధ్ కి ఆ దర్శకుడు అంటే చాలా ఇష్టమట…ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరంటే..?

ఒకప్పుడున్న స్టార్ డైరెక్టర్లు అందరిలో పూరి జగన్నాధ్ మొదటి స్థానంలో ఉండేవాడు.

Written By:
  • Gopi
  • , Updated On : December 2, 2024 / 04:39 PM IST

    Puri Jagannadh

    Follow us on

    Puri Jagannadh : ఒకప్పుడున్న స్టార్ డైరెక్టర్లు అందరిలో పూరి జగన్నాధ్ మొదటి స్థానంలో ఉండేవాడు. ఒకప్పుడు ఆయన చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమెజ్ ను కూడా క్రియేట్ చేశాయి. మరి అలాంటి దర్శకుడు ఇప్పుడు కొంచెం గాడితప్పి డిజాస్టర్ సినిమాలను చేస్తున్నాడు. కారణం ఏదైనా కూడా ఆయన మరోసారి బౌన్స్ బ్యాక్ అయితే చూడాలని చాలామంది ప్రేక్షకులు వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ నేషనల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు ను సంపాదించుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్… ఈయన పవన్ కళ్యాణ్ తో చేసిన బద్రి సినిమాతో మంచి విజయాన్ని సాధించింది. ఇక దాంతో మొదటి సినిమాతోనే స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇక ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో అప్పటినుంచి ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీ లో ముందుకు దూసుకుపోతూనే ఉన్నాడు. ఇక ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్ళే ఈయన మాత్రం కొన్ని సినిమాల విషయం లో అజాగ్రత్తగా ఉండటం వల్ల ఆ సినిమాలన్ని ప్లాప్ అవుతున్నాయి. ఇక వరుసగా రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజస్టర్లను అందుకున్న ఆయన ఇప్పుడు మరోసారి మరో ప్రయత్నం చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా కెరియర్ మొదట్లో ఆయన మణిరత్నం అభిమానిగా ఉండటం తద్వారా ఆయన ఇండస్ట్రీ కి వచ్చారు. ఇక ఆయన సినిమాల్లో మణిరత్నం గారి రిఫరెన్స్ ఏమాత్రం లేకపోయినా కూడా ఆయనను ఇన్స్పిరేషన్ గా తీసుకొని పూరి జగన్నాథ్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినట్టుగా చెప్పడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళుతున్న ఈ స్టార్ డైరెక్టర్ తన గురువు అయినా రామ్ గోపాల్ వర్మ కంటే కూడా తనకు మణిరత్నం అంటే ఎక్కువ ఇష్టమని ఒకానొక సందర్భంలో తెలియజేశాడు. నిజానికి రామ్ గోపాల్ వర్మ మీద అతనికి అభిమానం ఉంటుంది.

    కానీ మణిరత్నం వల్లే తను సినిమా ఇండస్ట్రీకి వచ్చానని అలాగే సినిమా డైరెక్టర్ గా మారడానికి కూడా తనే కారణం అయ్యాడు కాబట్టి మణిరత్నం గారు అంటేనే తనకు అమితమైన ఇష్టమట. ఇక వర్మ మీద అభిమానం ఆయన కోసం ఏదైనా చేయాలని తెగింపు ఈ రెండు మాత్రం వర్మ మీద ఉంటాయని పూరి జగన్నాధ్ చెప్పడం విశేషం…

    ప్రస్తుతం పూరి జగన్నాధ్ స్టార్ హీరోలతో సినిమాలు చేయకుండా మీడియం రేంజ్ హీరోలతోనే సినిమాలు చేస్తూ కెరియర్ ను నెట్టుకుంటూ వస్తున్నాడు. ఇక ఆయన చేసిన సినిమాలు ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో మరోసారి యంగ్ హీరోతోనే సినిమా చేయాలనే ప్రణాళికలను రూపొందించుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

    మరి తను అనుకున్నట్టుగానే ఇప్పుడు గోపీచంద్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక వీళ్ళ కాంబినేషన్ లో రాబోయే సినిమా వర్కౌట్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…