https://oktelugu.com/

Deputy CM Pawan Kalyan : చంద్రబాబుతో హాట్ భేటీ.. తేల్చి చెప్పిన పవన్.. నిర్ణయమే తరువాయి

ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. రెండున్నర గంటల పాటు వారి మధ్య సమావేశం జరిగింది. రాష్ట్రానికి సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో పవన్ కొన్ని అంశాలపై చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.

Written By:
  • Dharma
  • , Updated On : December 2, 2024 / 04:49 PM IST

    Pawan Kalyan meet Chandrababu

    Follow us on

    Deputy CM Pawan Kalyan : ఏపీలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోతోంది. ఇటీవల కాకినాడ పోర్టుకు వెళ్లి నేరుగా పవన్ పట్టుకున్న సంగతి తెలిసిందే. ఇంకో వైపు రాజ్యసభ ఎన్నికలు సైతం జరగనున్నాయి. అదే సమయంలో కూటమి ప్రభుత్వం కీలక సంక్షేమ పథకాలను ప్రారంభించేందుకు సిద్ధపడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో సీఎం చంద్రబాబును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలుసుకున్నారు. ఉండవల్లి లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి కలిశారు. మధ్యాహ్నం భోజనం తర్వాత ఇద్దరు నేతలు చర్చలు జరిపారు. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో వీరి చర్చలకు ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు రేపు క్యాబినెట్ భేటీ జరగనుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కొన్ని కీలక సంక్షేమ పథకాలకు సంబంధించి నిర్ణయం తీసుకోనుంది. ఈ తరుణంలోకీలక ప్రజాప్రతినిధులు సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.ఇద్దరు నేతలు ఏకాంతంగా చర్చలు జరపడం రకరకాల అనుమానాలకు తావిస్తోంది. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ ఢిల్లీలో పర్యటించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి చాలా అంశాలను కేంద్ర పెద్దలతో చర్చించారు పవన్. ఢిల్లీ పర్యటన సారాంశాన్ని చంద్రబాబుతో చర్చించినట్లు సమాచారం.

    * ప్రధానంగా దానిపై ఫిర్యాదు
    కాకినాడ పోర్టు నుంచి పెద్ద ఎత్తున రేషన్ బియ్యం తరలింపు పై ఇప్పటికే పవన్ ఒక నివేదిక సిద్ధం చేశారు. వైసిపి ప్రభుత్వ హయాంలో జరిగిన దందా.. ఇప్పటికీ కొనసాగుతున్న విషయాన్ని చంద్రబాబుకు గుర్తు చేశారు. అక్కడి పోర్టులో జరుగుతున్న అక్రమాల చిట్టా, అధికారుల తీరుపై చంద్రబాబుకు పవన్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు రెండున్నర గంటల పాటు కొనసాగిన ఈ భేటీ.. ప్రధానంగా బియ్యం మాఫియా పైనే సాగినట్లు సమాచారం. ఢిల్లీ పర్యటనలు కేంద్రం ముందు తాను పెట్టిన ప్రతిపాదనల గురించి కూడా పవన్ చంద్రబాబుకు వివరించినట్లు తెలుస్తోంది.

    మరోవైపు ఏపీలో రేపటి నుంచి రాజ్యసభ ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రేపు ఈసి నోటిఫికేషన్ ప్రకటించనుంది. అయితే రాజ్యసభ పదవుల భర్తీ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో.. ఇద్దరు నేతలు ప్రధానంగా చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ విషయంలో చంద్రబాబు సైతం పవన్ సలహా తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రేపటి మంత్రివర్గ సమావేశంలో తీసుకునే నిర్ణయాలపై కూడా ఇద్దరి నేతల మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. అయితే ప్రజలకు మంచి పాలన అందిస్తూనే అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెట్టాలని ఇద్దరు నేతలు సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం మధ్య జరిగిన చర్చలు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనన్న సస్పెన్స్ కొనసాగుతోంది.