https://oktelugu.com/

Puri Jagannadh : గోపీచంద్ తో ఆ సినిమాకు సీక్వెల్ తీయబోతున్న పూరీ జగన్నాథ్.. ఈ సారైనా హిట్ దక్కేనా ?

పూరి జ‌గన్నాథ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో తనకో పేరుంది.ఆయన చాలా వేగంగా సినిమాలు తీస్తారని అందరికీ తెలిసిందే. తన కెరీర్లో చిన్న హీరోలను సైతం స్టార్ హీరోలుగా మార్చిన సంగతి తెలిసిందే.

Written By: , Updated On : February 19, 2025 / 01:28 PM IST
Puri Jagannadh , Gopichand

Puri Jagannadh , Gopichand

Follow us on

Puri Jagannadh : పూరి జ‌గన్నాథ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో తనకో పేరుంది.ఆయన చాలా వేగంగా సినిమాలు తీస్తారని అందరికీ తెలిసిందే. తన కెరీర్లో చిన్న హీరోలను సైతం స్టార్ హీరోలుగా మార్చిన సంగతి తెలిసిందే. తన కెరీర్లో బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను హీరోలకు అందించిన ఆయన గత కొంత కాలంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. సినిమానే ఆయన ప్రపంచం. సినిమానే ఆయన లోకం.సినిమాల పట్ల తన మెంటాల్టీ ఎలా ఉంటుందో నేనింతే సినిమాలో రవితేజతో చెప్పించారు కూడా. ఒక సినిమా ప్లాప్ అయిందంటే అక్కడితో ఆగిపోను.. ఇంకో సినిమా తీస్తానని అంటాడు. రవితేజ, రామ్ చరణ్, బాలకృష్ణ, మహేశ్ బాబు లాంటి వాళ్లకు సూపర్ హిట్ చిత్రాలు అందించారు ఆయన.

అలాంటి ఆయన తన సినిమాల‌కు సీక్వెల్ చేసిన దాఖ‌లాలు దాదాపు తక్కువే. ఇస్మార్ట్ శంక‌ర్ ని డ‌బుల్ ఇస్మార్ట్‌గా తీశారు పూరి జగన్నాథ్. అయితే అది డిజాస్ట‌ర్ అయ్యింది. ఇప్పుడు మ‌రోసారి సీక్వెల్ కోసం కథ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. పూరీ ప్రస్తుతం ముంబైలో ఉన్నారట. అక్కడ కొత్త కథకు కసరత్తులు చేస్తున్నారని సమాచారం. ఆయన నెక్ట్స్‌ సినిమా ఏ హీరోతో అనేది మాత్రం ఇప్పటి వరకూ క్లారిటీ లేదు. తాజాగా ఈ విషయంపై ఓ వార్త హల్ చల్ చేస్తుంది. పూరీ నెక్ట్స్‌ సినిమా గోపీచంద్‌తో ఉంటుందని టాక్. పూరీ, గోపీచంద్‌ కలిసి 2010లో ‘గోలీమార్‌’ సినిమా చేశారు. ఆ సినిమా అప్పట్లో బాగానే ఆడింది.

మళ్లీ ఇన్నాళ్లకు వీరిద్దరూ కలిసి పని చేస్తున్నారని తెలుస్తోంది. ఇది ‘గోలీమార్‌’కు సీక్వెల్‌గా ఉంటుందని కూడా అంటున్నారు. ‘గోలీమార్‌’లో హీరో క్యారెక్టరైజేషన్‌ బావుంటుంది. దానిచుట్టూ కొత్త కథను నడిపించ వచ్చని పూరీ భావిస్తున్నట్టు ఫిల్మ్‌వర్గాల టాక్‌. ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేశ్‌ నిర్మించే అవకాశాలున్నాయి. ఈ ఏడాది మూడు సినిమాలు నిర్మించాలనేది ఆయన ప్లాన్‌. వాటిలో ‘గోలీమార్‌ 2’ ఒకటని సమాచారం.

గోలీమార్‌ క‌మ‌ర్షియ‌ల్ గా ఓకే అనిపించిన సినిమా అది. ఇప్పుడు మ‌రోసారి పూరి – గోపీచంద్ క‌లిసి ప‌ని చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ‘డ‌బుల్ ఇస్మార్ట్‌’ త‌ర‌వాత పూరి జగన్నాథ్ చేయ‌బోయే సినిమా ఏమిటన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. తనకు హిట్లు ఇచ్చిన పెద్ద హీరోలు ఎవరూ పూరీకి ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదు. పైగా అంద‌రూ ఎవ‌రి ప్రాజెక్టుల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. దాంతో అందుబాటులో ఉన్న హీరోతోనే ప్రాజెక్ట్ సెట్స్‌పైకి తీసుకెళ్లాల‌ని పూరి భావిస్తున్నారట. గోపీచంద్ కూడా బిజీనే. కాక‌పోతే.. గోపీచంద్ ఇప్పుడు మిగిలిన ప్రాజెక్టుల్ని ప‌క్క‌న పెట్టి పూరితో ప‌ని చేయ‌డానికి ఉత్సాహం చూపిస్తున్న‌ట్లు సమాచారం. పూరి ద‌గ్గ‌ర కొత్త క‌థ‌ల‌కు కొద‌వ ఉండ‌దు. ఆయ‌న ద‌గ్గ‌ర బౌండెడ్ స్క్రిప్టులు చాలా రెడీగా ఉంటాయి. అలాంట‌ప్పుడు సీక్వెల్ ఎందుకు తీయాల్సివ‌స్తుందో? పైగా ‘డ‌బుల్ ఇస్మార్ట్‌’ ఫలితం ఎలా ఉందో తెలిసిందే. ఇలాంటి త‌రుణంలో ఈ నిర్ణ‌యం ఎందుకు తీసుకోవాల్సివ‌చ్చిందా అని అభిమానులు ఆలోచిస్తున్నారు.